Business Idea : విందు, వినోదం.. ఇతర కార్యక్రమాలు.. ఏవైనా సరే.. ఒకప్పుడు ప్లాస్టిక్ ప్లేట్లలో భోజనాలు పెట్టేవారు. కానీ ఇప్పుడు అలా కాదు. పేపర్ ప్లేట్లనే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. తక్కువ ఖరీదుతో.. యూజ్ అండ్ త్రో సౌకర్యం ఉంటుంది కనుక.. చాలా మంది భోజనాలకు వీటినే వాడుతున్నారు. ఇక పేపర్ ప్లేట్లను తయారు చేసే వ్యాపారులు ఎక్కువయ్యారు. ఈ క్రమంలోనే నిరుద్యోగులు, మహిళలు.. ఈ బిజినెస్ ద్వారా నెలకు రూ.వేలల్లో సంపాదించవచ్చు. ఈ బిజినెస్ వారికి చక్కని స్వయం ఉపాధి అవుతుంది. మరి ఇందుకు ఎంత పెట్టుబడి అవసరం అవుతుందో.. ఎంత వరకు సంపాదించవచ్చో.. ఇప్పుడు తెలుసుకుందామా..!
పేపర్ ప్లేట్ల తయారీ బిజినెస్‌కు పెద్దగా స్థలం అవసరం లేదు. ఇండ్లలోనే ఈ మెషిన్లను పెట్టుకోవచ్చు. స్థలం లేని వారు చిన్నపాటి షెడ్లను లీజుకు తీసుకుని వాటిల్లో ఈ బిజినెస్ ప్రారంభించవచ్చు. ఇందుకు గాను సింగిల్ ఫేజ్ కరెంట్ సరిపోతుంది. అలాగే పేపర్ ప్లేట్లను తయారు చేసే మెషిన్లు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇవి మార్కెట్‌లో రూ.60వేల ప్రారంభ ధరకు లభిస్తున్నాయి. సింగిల్ హైడ్రాలిక్ పేపర్ ప్లేట్ మెషిన్ ధర రూ.60వేలు ఉంటుంది. డబుల్ హైడ్రాలిక్ మెషిన్ ధర రూ.1.20 లక్షల వరకు ఉంటుంది. వీటిని మార్కెట్‌లో కొనుగోలు చేయాలి. అనంతరం పేపర్ ప్లేట్లను తయారు చేసేందుకు అవసరం అయ్యే ముడి సరుకును కొనాలి. గ్రీన్, సిల్వర్ తదితర రంగుల్లో ఉండే చతురస్రాకార షీట్లను ముందుగా రెడీ చేసుకోవాలి. ఆ తరువాత పేపర్ ప్లేట్లను తయారు చేయవచ్చు.
హైడ్రాలిక్ మెషిన్‌లో హెడ్ కింద సదరు చతురస్రాకార షీట్‌ను ఉంచితే.. మెషిన్ దాన్ని రౌండ్‌గా కట్ చేసి.. అదే సమయంలో దాన్ని ప్లేట్‌లా మార్చుతుంది. ఇలా సింగిల్ హైడ్రాలిక్ మెషిన్ ద్వారా రోజుకు 5వేలు, డబుల్ హైడ్రాలిక్ మెషిన్ ద్వారా రోజుకు 8వేల వరకు బఫెట్ పేపర్ ప్లేట్లను తయారు చేయవచ్చు. ఇక ఒక్కోప్లేటును మార్కెట్‌లో 20పైసల ధరకు హోల్‌సేల్‌గా విక్రయించవచ్చు. దీంతో 5వేల ప్లేట్లకు రోజుకు రూ.1వేయి, 8వేల ప్లేట్లకు రోజుకు రూ.1600 వరకు ఆదాయం వస్తుంది. అందులో ఖర్చులు పోను రోజుకు రూ.800 నుంచి రూ.1400 వరకు మిగులుతుంది. ఈ క్రమంలో నెలకు రూ.24వేల నుంచి రూ.42వేల వరకు సంపాదించవచ్చు.
అయితే పేపర్ ప్లేట్లను తయారు చేయడంతోనే సరిపోదు.. వాటిని మార్కెటింగ్ చేసి విక్రయించాల్సి ఉంటుంది. ఆ ఒక్క అంశంలో శ్రమిస్తే.. నెలకు రూ.వేలల్లో సంపాదించుకోవచ్చు. దీనికి పెద్దగా ఎలాంటి కోర్సు నేర్చుకోవాల్సిని పనిలేదు. అలాగే పెద్దగా మ్యాన్‌పవర్ కూడా అవసరం ఉండదు. ఇక పేపర్ ప్లేట్లను తయారు చేయగా వచ్చే షీట్ల స్క్రాప్‌ను కేజీకి రూ.2 చొప్పున విక్రయిస్తే.. అందులోనూ లాభం వస్తుంది. ఈ క్రమంలో పేపర్ ప్లేట్ల తయారీ బిజినెస్ ఔత్సాహికులకు చక్కని ఆదాయ వనరు అవుతుందని చెప్పవచ్చు..!
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…