Allu Arjun Sneha : టాలీవుడ్ బెస్ట్ సెలబ్రిటీ కపుల్స్ లో ఒకరైన అల్లు అర్జున్, స్నేహ దంపతుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 2011లో వివాహబంధంతో ఒక్కటైన ఈ జంట ఎందరికో ఆదర్శంగా ఉన్నారని చెప్పవచ్చు. నిత్యం సినిమా షూటింగులతో ఎంతో బిజీగా ఉండే అల్లు అర్జున్ తనకు ఏ మాత్రం ఖాళీ దొరికినా తన ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తూ అందుకు సంబంధించిన ఫోటోలను అభిమానులతో పంచుకుంటుంటారు.

తాజాగా అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి పుట్టినరోజు నేడు (సెప్టెంబర్ 29వ తేదీ) కావడంతో అల్లు అర్జున్ తనకు సర్ ప్రైజ్ ఇచ్చారు. ఈ క్రమంలోనే తన భార్య స్నేహ రెడ్డి పుట్టినరోజు వేడుకలలో భాగంగా నిన్న రాత్రి కేవలం అత్యంత సన్నిహితుల మధ్య కేక్ కటింగ్ చేయించి తన భార్య పుట్టినరోజు వేడుకలలో పాల్గొన్నారు.
ఈ క్రమంలోనే ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. నా జీవితంలో ఎంతో ప్రత్యేకమైన వ్యక్తికి పుట్టినరోజు శుభాకాంక్షలు. నీతో కలిసి మరెన్నో వేడుకలు జరుపుకోవాలని కోరుకుంటున్నాను, హ్యాపీ బర్త్ డే మై డియర్ క్యూటీ.. అంటూ తన భార్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో బన్నీ అభిమానులు పెద్ద ఎత్తున స్నేహ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.