ఈ సృష్టిలో తల్లి ప్రేమ కన్నా మించిన ప్రేమ మరెక్కడా దొరకదు. అది కేవలం మనుషులలో మాత్రమే కాదు, జంతువులైనా, పక్షులైనా.. తల్లి ప్రేమ ఒక్కటే ఉంటుంది. ఇలా తల్లి ప్రేమ తన బిడ్డలపై ఎప్పుడూ ఉంటుంది. కొన్నిసార్లు తన బిడ్డ ప్రాణాలను కాపాడటం కోసం తన తల్లి ప్రాణాలను కూడా లెక్కచేయకుండా బిడ్డ కోసం తాపత్రయ పడుతుంది. తాజాగా ఇలాంటి ప్రేమను ఓ జింక తన బిడ్డపై చూపింది. ఓ జింక తన బిడ్డ ప్రాణాలను కాపాడటం కోసం చేసిన సాహసానికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
ఈ వీడియోలో భాగంగా కొన్ని జింకలు కలిసి నది దాటుతూ ఉండగా అందులో ఒక జింక పిల్ల జింకల ముందుకు కొంచెం పక్కగా వెళ్లింది. ఈ క్రమంలోనే ఆ జింక పిల్లను చూసిన మొసళ్ళు వెంటనే ఆ జింక పిల్లపై దాడి చేయడానికి వచ్చాయి. ఇది గమనించిన తల్లి జింక వెంటనే తన బిడ్డ ప్రాణాలను కాపాడటం కోసం ఆ మొసళ్ళకు ఎరగా అడ్డుపడింది. ఇలా తన బిడ్డ ప్రాణాలను రక్షించడం కోసం మొసలి చేతికి తల్లి జింక దొరికి తన బిడ్డ ప్రాణాలను కాపాడింది.
https://www.instagram.com/p/CUL8EEBlI5M/?utm_source=ig_web_copy_link
ఈ క్రమంలోనే జింక పిల్ల క్షేమంగా బయటకి పోగా.. తల్లి జింక మాత్రం ఆ మొసలి బారినపడి మృతి చెందింది. తన బిడ్డ కోసం ఆ తల్లి ప్రాణాలు విడవడం ఎంతోమంది నెటిజన్లను కలచివేసింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.