పాములను పట్టుకోవాలంటే చాలా ఓపిక, సహనం, నైపుణ్యం ఉండాలి. చిన్న పొరపాటు చేసినా దాని కాటుకు బలి కావల్సి వస్తుంది. అందుకనే కొందరు నిష్ణాతులైన వారే ఆ పని చేస్తుంటారు. ఇక ఓ వ్యక్తి కూడా సరిగ్గా ఇలాగే చాలా నైపుణ్యంతో ఓపిగ్గా ఓ నాగుపామును పట్టాడు. వివరాల్లోకి వెళితే..
ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ సుశాంత నంద తాజాగా తన ట్విట్టర్ ఖాతాలో ఓ వీడియోను పోస్ట్ చేశారు. అందులో ఓ వ్యక్తి అత్యంత నైపుణ్యంతో చాలా చాకచక్యంగా ఓ నాగుపామును ఎలా పట్టుకున్నాడో చూడవచ్చు.
స్కూటర్ హెడ్లో దాక్కున్న పామును ముందుగా అతను బయటకు రప్పించాడు. తరువాత అది పడగ విప్పి పైకి లేవగానే దానిపై ఓ 20 లీటర్ల ఖాలీ వాటర్ క్యాన్‌ను బోర్లా ఉంచాడు. దీంతో వెంటనే ఆ పాము అందులోకి వెళ్లింది. దీంతో అతను దాన్ని పట్టుకునే ప్రయత్నం చేయగా వెంటనే ఆ పాము బయటకు వచ్చేసింది.
Such guests during rains are common…
But uncommon is the method used to rescue it. Never ever try this? pic.twitter.com/zS4h5tDBe8— Susanta Nanda (@susantananda3) September 7, 2021
అయితే ఆ పాము బయటకు వచ్చినా దాన్ని మళ్లీ ఆ క్యాన్ లోపలికి చొప్పించాడు. అందుకు చాలా సేపు ఓపిగ్గా వేచి చూశాడు. చివరకు పాము అందులోకి వెళ్లగానే వెంటనే దానిపై మూత పెట్టేశాడు. ఇది ఎక్కడ జరిగిందో తెలియదు కానీ ఏడాది కిందటి వీడియో ఇది. అయినప్పటికీ ఈ వీడియో వైరల్ అవుతోంది. అతను అంత చాకచక్యంగా పామును పట్టడాన్ని చూసి నెటిజన్లు అతన్ని మెచ్చుకుంటున్నారు. అవును.. నిజంగా చాలా నైపుణ్యంతో పామును పట్టాడు మరి..!