సిగరెట్ తాగడం ఆరోగ్యానికి హానికరం. ఈ విషయం తెలిసి కూడా చాలా మంది సిగరెట్లను తాగుతూ అనారోగ్యాలను కొని తెచ్చుకుంటున్నారు. అయితే వారు తాగితే తాగారు, కానీ వారి వల్ల ఇతరులకు కూడా నష్టం కలుగుతోంది. కొందరైతే సిగరెట్ తాగవద్దని ఎంత చెప్పినా వినడం లేదు. ఇక కొందరైతే ఏకంగా పెట్రోల్ పంప్‌లలోనూ సిగరెట్లను తాగుతున్నారు.
పెట్రోల్ పంప్‌లలో చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్న నిప్పు రవ్వ పడినా ఎంతో ఘోర ప్రమాదం జరుగుతుంది. అలాంటి చోట్ల అసలు సిగరెట్లను తాగరాదు. కానీ ఆ వ్యక్తి తాగాడు. పైగా ఓనర్ ఎంత సర్ది చెప్పినా వినలేదు. దీంతో ఆ ఓనర్‌కు చిర్రెత్తుకొచ్చింది. వెంటనే పక్కకు వెళ్లి అక్కడే ఉన్న ఫైర్ ఎక్స్‌టింగ్విషర్‌ను తెచ్చి వెంటనే కార్ దగ్గర స్ప్రే చేశాడు.
Gas station owner takes precautionary measures after customer refuses to put out his cigarette
byu/mattmilk5 innextfuckinglevel
వీడియోలో నీలి రంగు టీ షర్టు తొడుక్కున్న వ్యక్తి పెట్రోల్ నింపుకుంటున్నాడు. అయితే అతనికి ఎదురుగా ఇంకో కారులో ఓ వ్యక్తి సిగరెట్ తాగుతున్నాడు. అక్కడ ఓనర్ సిగరెట్ తాగవద్దని అతన్ని కోరాడు. కానీ అతను వినకపోవడంతో ఓనర్ వెంటనే ఫైర్ ఎక్స్‌టింగ్విషర్‌ను తెచ్చి అక్కడంతా స్ప్రే చేశాడు. దీంతో అక్కడ దట్టమైన తెల్లని పొగలా అలుముకుంది.
ఆ సమయంలో అక్కడి సీసీ కెమెరాల్లో దృశ్యాలు రికార్డయ్యాయి. అయితే నిజానికి ఈ ఘటన జరిగి 4 ఏళ్లు అయింది. కానీ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. అందరూ ఆ ఓనర్ చేసిన పనిని మెచ్చుకుంటున్నారు. సిగరెట్ వద్దంటే వినని వారికి ఇలాగే బుద్ధి చెప్పాలంటూ నెటిజన్ల కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ వీడియోను చాలా మంది ఇప్పటికే వీక్షించారు.