Yoga For Thyroid : ఈరోజుల్లో చాలామంది, థైరాయిడ్ తో బాధపడుతున్నారు. హైపర్ థైరాయిడ్ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. హైపర్ థైరాయిడ్ ని కంట్రోల్ చేసుకోవడానికి ఏం చేయాలి..? ఎటువంటి పద్ధతులు పాటించాలి..? థైరాయిడ్ నుంచి ఈజీగా ఎలా బయట పడవచ్చు వంటి ముఖ్యమైన విషయాలను తెలుసుకుందాం. థైరాయిడ్ అనేది మనకి థైరాక్సిన్ అనే హార్మోన్ ఎక్కువ రిలీజ్ అవ్వడం వలన కలుగుతుంది. బాగా బరువు తగ్గిపోవడం, ఎంత తిన్నా వంట పట్టకపోవడం, సన్నగానే ఉండడం, కళ్ళు తిరుగుతున్నట్లు ఉండడం, ఇన్ఫెక్షన్స్, ఇమ్యూనిటీ తగ్గిపోవడం, కళ్ళు ఎర్రగా మారిపోవడం, చూపు తగ్గిపోవడం, జుట్టు రాలిపోవడం, పీరియడ్స్ రెగ్యులర్ గా ఉండడం, పీసిఓస్ సమస్యలు ఇటువంటివన్నీ కూడా థైరాయిడ్ లక్షణాలని చెప్పచ్చు.
ఇటువంటి లక్షణాలు కనుక ఉంటే, కచ్చితంగా డాక్టర్ని సంప్రదించండి. లేదంటే థైరాయిడ్ టెస్ట్ చేయించుకోండి. యోగా ద్వారా కంట్రోల్ అవుతుంది. డైట్ విషయం లో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఈ పౌష్టికాహారాన్ని మాత్రమే తీసుకోవాలి. ఫైబర్ ఎక్కువగా ఉండే, ఆహార పదార్థాలను తీసుకోవాలి. సలాడ్స్, ఆకుకూరలు, పప్పులు వంటివి తీసుకుంటూ ఉండండి.

సర్వంగాసనం ప్రాక్టీస్ చేసేటప్పుడు, కొంచెం కష్టంగా ఉంటుంది. కానీ, రెగ్యులర్ గా చేస్తూ ఉంటే ఈజీ గానే ఉంటుంది. సర్వంగాసనం చేయడం వలన థైరాయిడ్ సమస్య తగ్గుతుంది. డయాబెటిస్ కూడా కంట్రోల్ అవుతుంది. ఈ ఆసనం వేయడం వలన అద్భుతమైన లాభాలు ఉంటాయి.
ముఖ్యంగా థైరాయిడ్ సమస్యతో బాధపడే వాళ్ళు ఈ ఆసనాన్ని రెగ్యులర్ గా చేయడం మంచిది. ఒక మూడు నిమిషాల పాటు ఆసనం వేసి మళ్లీ ఆగి, ఈ ఆసనాన్ని వేయండి కంటిన్యూస్ గా ఎక్కువ టైం వేయకూడదు. మరీ ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే కూడా ఇబ్బంది కలుగుతుంది. సో టైం చూసుకుని చేస్తూ ఉంటే, థైరాయిడ్ సమస్య తగ్గుతూ ఉంటుంది. అలానే వైద్యుల సలహా కూడా తీసుకోవడం మంచిది.