Guppedantha Manasu November 30th Episode : కేసు నుండి వసుధార బయటపడిపోయిందని. ఆ విషయాన్ని సైలేంద్రకి చెప్పాలని టెన్షన్తో ఫోన్ చేస్తుంది దేవయాని. కానీ, ధరణి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. పనిమనిషి గురించి, ఇంటి పనుల గురించి అడిగి అడిగి ధరణి చికాకు పెడుతుంది. కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ధరణి ప్రశ్నలకు సమాధానాలు చెప్తుంది దేవయాని. శైలేంద్ర వచ్చి వాళ్ళ అమ్మతో మాట్లాడుతాడు. నీకు ఎన్నిసార్లు ఫోన్ చేయాలి..? ఎక్కడ చచ్చావ్ అని సీరియస్ అవుతుంది దేవయాని. వసుధారని కేసులో ఇరికించింది ఎమ్మెస్సార్ కదా అని తల్లితో శైలేంద్ర అంటాడు.
కొడుకు మాటలకి దేవయాని షాక్ అవుతుంది. తాను చెప్పకుండా ఎలా తెలిసిపోయిందని ఆశ్చర్యపోతుంది. కథ అల్లింది నేనే కదా..? ఈ కథలో ఏ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేయాలో ఎవరు ఎలా ప్రవర్తించాలో నేనే డిసైడ్ చేశా అని, తల్లితో శైలేంద్ర చెప్తాడు. ఎమ్మెస్సార్ పేరు చెప్పించి మంచి పని చేశావు. లేదంటే మన బండారం బయటపడిపోయి, అనంత లోకంలో కలిసిపోయే వాళ్ళం మనం అని భయపడుతుంది. తప్పు చేసిన వాడు దొరకడం ఖాయం. కానీ దొరక్కుండా ప్లాన్ చేసుకోవడమే శైలేంద్ర స్పెషల్ అని అంటాడు. జగతిని చంపిన వారిని పట్టుకోవడంలో ఎందుకు ఆలస్యం చేస్తున్నావని, అనుపమ అడిగినందుకు రిషి ఆలోచిస్తూ ఉంటాడు.
అమ్మని చంపిన వాళ్లని పట్టుకోవాలని, వాళ్ళని శిక్షించాలని నీకు అనిపించట్లేదా అని అనుపమ తనని నిలదీయడం రిషి తట్టుకోలేక పోతాడు. అమ్మ చావుని, నేను ఎప్పుడూ తేలికగా తీసుకోవాలని అనుకోలేదని రిషి అనుకుంటాడు. జగతి అంటే అభిమానంతోనే అనుపమ ఆలా మాట్లాడిందని రిషి అర్థం చేసుకుంటాడు. జగతిని తనకి దూరం చేసిన దుర్మార్గులని, ఎప్పటికీ వదిలిపెట్టనని ఫిక్స్ అవుతాడు. వసుధార అలా ఆలోచనలో పడొద్దు అని చెప్పి పిలుస్తుంది. నీ ప్రేమ నాకు నచ్చలేదు అని రిషి చెప్తాడు.
రిషి మాటలకి వసుధార షాక్ అవుతుంది. ప్రేమ ఏకపక్షంగా ఉండకూడదని, నువ్వు నన్ను ప్రేమిస్తే చాలా నిన్ను నువ్వు ప్రేమించుకోవాలి అని అడుగుతాడు. నన్ను నేను ప్రేమించుకోకపోయినా, నా కంటే ఎక్కువ ప్రేమించడానికి ఒకరు ఉన్నారు. అది మీరే అని అంటుంది. ఒకరిపై మరొకరు పోటీపడి ప్రేమని కురిపించుకుంటారు. రిషి కోసం చక్కెర పెరుగులో వేసి ఇస్తుంది. తాను తినడమే కాకుండా, వసుధారకు కూడా పెడతాడు. ఇద్దరు ప్రేమ మైకంలో ఉంటారు.
వసుధారకు ముద్దు ఇవ్వబోతాడు. ఈలోగా ఫోన్ మోగుతుంది. ఒక వాయిస్ దొరికిందని, ఆ వాయిస్ ఎవరిదో గుర్తుపట్టడానికి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రావాలని ముకుల్ చెప్తాడు. దేవయాని ఇంటికి రమ్మంటాడు. దేవయాని కంగారు పడుతుంది. జగతి షూట్ చేసిన షూటర్ ఫోన్లో ఒక వాయిస్ దొరికిందని చెప్తాడు. అది శైలేంద్ర వాయిస్ కాకూడదని మనసులోనే దేవుడిని వేడుకుంటుంది. దేవయాని శైలేంద్ర తో కిల్లర్ మాట్లాడిన ఆడియో ని ప్లే చేస్తాడు ముకుల్. అది విని అందరు షాక్ అయిపోతారు. రిషి, ఫణింద్ర తో పాటుగా అందరూ కూడా వాయిస్ ని గుర్తుపట్టేస్తారు.
తన కొడుకే జగతిని చంపడాని, వాడే ఇలా చేశాడని ఎమోషనల్ అయిపోతాడు ఫణింద్ర. ఖచ్చితంగా శైలేంద్ర వాయిస్ అని ముకుల్ తో అంటాడు మహేంద్ర. జగతి మాత్రం శైలేంద్ర వాయిస్ కాదని వాదిస్తుంది. తన కొడుకు మంచి చేసే వాడే కానీ ప్రాణాలు తీసే వాడు కాదు అని చెప్తుంది. సాక్ష్యం ఉంటే ఎలా కాదని చెప్తారు అని ముకుల్ అడుగుతాడు. గ్రాఫిక్స్ అని ఎవరో కావాలని చేశారని రకరకాలుగా దేవయాని చెప్పడం మొదలుపెడుతుంది.
కానీ, ముకుల్ ఇవన్నీ కుదరవని చెప్తాడు. ఈ సాక్షాన్ని నమ్మొద్దని భర్తతో దేవయాని అంటుంది. ఇంటరాగేషన్ చేస్తామని తప్పు చేయలేదని తెలిస్తేనే వదిలిపెడతామని ముకుల్ అంటాడు దేవయాని మాత్రం సైలేంద్రని ఇంటరాగేషన్ చేయడానికి ఒప్పుకోదు. ఇదంతా వట్టి బూటకం అని ముకుల్ తో చెప్పమని రిషి కి చెప్తుంది. రిషి పట్టించుకోకుండా అక్కడి నుండి వెళ్ళిపోతాడు అక్కడితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.