Cardamom For Beauty : అందంగా ఉండడానికి, చాలామంది రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అందంగా ఉండడం అంత ఈజీ కాదు. మనం ముఖాన్ని, ఎంత అందంగా ఉంచుకోవాలనుకున్నా, మచ్చలు, మొటిమలు ఇలా ఏదో ఒకటి వస్తూ ఉంటాయి. అందాన్ని పెంపొందించుకోవాలన్నా, అందాన్ని రెట్టింపు చేసుకోవాలన్నా యాలుకలు బాగా ఉపయోగపడతాయి. యాలకులు తో, అందాన్ని మనం పెంపొందించుకోవచ్చు. ఆరోగ్యానికి ఇవి మేలు చేస్తాయి. అలానే, వంటకి మంచి రుచి ని కూడా ఇస్తాయి. కానీ, అందాన్ని కూడా వీటి ద్వారా మనం పెంపొందించుకోవచ్చు.
యాలకులుని బ్యూటీ ప్రొడక్ట్స్ లో కూడా వాడుతూ ఉంటారు. చాలామందికి ఈ విషయం తెలీదు. యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఇందులో ఉంటాయి. సో, చర్మాన్ని శుద్ధి చేసి, నల్లని మచ్చల్ని తొలగించి, చర్మ ఛాయని యాలకులు పెంచుతాయి. వీటిని, ఉపయోగించడం వలన మొటిమలు కూడా తగ్గిపోతాయి. ఒక బౌల్లో ఒక స్పూన్ యాలకులు పొడి వేసుకోండి. ఒక స్పూన్ తేనె కూడా వేసుకొని, రెండిటిని బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని మొటిమలు ఉన్నచోట రాస్తే, చాలా చక్కగా ఇది పనిచేస్తుంది.
మొటిమలు ఉన్నచోట రాసి, ఆరిన తర్వాత చల్లటి నీటితో కడిగేసుకుంటే, మొటిమలు పోతాయి. మొటిమల కారణంగా వచ్చే మచ్చలు కూడా పోతాయి. యాంటీ ఇంఫ్లమేటరీ గుణాలు కూడా యాలకులు లో ఉంటాయి. వాపుని కూడా ఇవి తగ్గించగలవు. యాలకులు రక్తాన్ని శుద్ధి చేస్తాయి. అలానే, రక్త ప్రసరణని కూడా పెంపొందిస్తాయి. చర్మం మెరసేటట్టు చూస్తాయి. యాలకులు లో యాంటీసెప్టిక్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కూడా ఉంటాయి. ఎలర్జీలని కూడా తగ్గిస్తాయి. నల్ల యాలకులు చర్మానికి హాని కలిగించే టాక్సిన్స్ ని బయటికి పంపిస్తాయి.
రోజు ఒక నల్ల యాలకని నమిలితే, శరీరాన్ని క్లీన్ చేసేస్తుంది. దాంతో చర్మం కూడా బాగుంటుంది. ఒక బౌల్ తీసుకుని, అందులో అర స్పూన్ ఓట్స్ పొడి, పావు స్పూన్ యాలకులు పొడి, కొద్దిగా రోజ్ వాటర్ వేసి బాగా కలిపి, ముఖానికి పట్టించి, పది నిమిషాలు అలా వదిలేసి తర్వాత గోరువెచ్చని నీటితో క్లీన్ చేసుకుంటే, ముడతలు, మచ్చలు, మొటిమలు పూర్తిగా తొలగిపోతాయి.