Pooja Hegde : ప్రస్తుతం టాలీవుడ్‌లో సెలబ్రిటీల పెళ్లి పీటలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇటీవల వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి పెళ్లి ఘనంగా జరిగింది. ఇక త్వరలో వెంకటేష్ కూతురి వివాహం జరగనుంది. ఇక నాగ చైతన్య హీరోగా నటించిన ‘ఒక లైలా కోసం’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన పూజా హెగ్డే పెళ్లి కూడా త్వరలో జరగనున్నట్టు ప్రచారం జరుగుతుంది. పూజా.. వరుణ్ హీరోగా పరిచయమైన ‘ముకుందా’ సినిమాతో మరింత దగ్గరైంది. వరుస ఫ్లాప్ప్‌తో సతమతమవుతోన్న పూజా హెగ్డే ఓ మంచి హిట్ కోసం ఎదురుచూస్తోంది.ఇటీవలి కాలంలో ఇక ఈ భామ సినిమాల విషయానికి వస్తే.. రాధేశ్యామ్ మొదలుకొని, ఆ తర్వాత వచ్చిన బీస్ట్, ఆచార్య ఇలా వరుసగా బాక్సాఫీస్ దగ్గర తుస్సుమంటున్నాయి.
పూజా హెగ్డేకి తెలుగులో అవకాశాలు తగ్గాయి.. పరిస్థితేమి బాగాలేదు.. దీనికి తోడు వచ్చిన సినిమా అవకాశాలు పోతున్నాయి. ఈ క్రమంలో పూజా హెగ్డే పెళ్లి పీటలెక్కేందుకు సిద్ధమైందని టాక్. పూజా హెగ్డే బాలీవుడ్ స్టార్ హీరో కొడుకుని పెళ్లి చేసుకోబోతుందని సమాచారం. ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అంతేకాదు వీళ్ళ కుటుంబ సభ్యులు కూడా వీళ్ళ పెళ్ళికి ఒప్పుకున్నారని తెలుస్తోంది. ఇక ఇరువైపు పెద్దలు వీళ్ళ పెళ్లికి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశారని… రేపో మాపో దీనిపై అధికారిక ప్రకటన రాబోతుందని బాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం పూజా హెగ్డే పెళ్లి మార్చి చివరల్లో ఉండనుందట.

డిసెంబర్ ఆఖరన నిశ్చితార్థం.. మార్చి చివరిలో పెళ్లి చేసుకోబోతున్నారని సమాచారం. అయితే ఈ దీపావళిని స్పెషల్ గా తనకు కాబోయే అత్తగారి ఇంట్లో సెలబ్రేట్ చేసుకుందని పూజా హెగ్డే. బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఈ న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. టాలీవుడ్ బుట్ట బొమ్మను చేసుకోబోయే ఆ బాలీవుడ్ స్టార్ హీరో కొడుకు పెళ్లి చేసుకోనున్నారని వార్తలు బయటకు వస్తున్నాయి.మరి ఇందులో నిజమెంత ఉందనేది తెలియాల్సి ఉంది.