Singer Chinmayi : సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఒకవైపు సినిమాలు, మరోవైపు ఇతర విషయాలపై స్పందిస్తూ ఉండే చిన్మయి ఇండస్ట్రీలో ఉండే పలు సమస్యలపై కూడా తనదైన శైలిలో స్పందిస్తూ ఉంటుంది. రీసెంట్‌గా రష్మిక ఫేక్ వీడియోపై కూడా స్పందించింది. ఏఐ టెక్నాలజీని దుర్వినియోగం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఫేక్ పిక్చర్స్ క్రియేట్ చేయడం వల్ల సెలబ్రిటీలే కాకుండా సామాన్యులు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఏఐ టెక్నాలజీని ఉపయోగించి మహిళలను దోచుకోవడం, బ్లాక్‌మెయిల్ చేయడం, అత్యాచారం చేయడం వంటి చర్యలకు పాల్పడే అవకాశం ఉందని గాయని చిన్మయి తన భయాన్ని వ్యక్తం చేసింది.
రష్మిక ఆల్రెడీ ఎక్స్ పోజింగ్ చేస్తుంది కదా అని లాజిక్ మాట్లాడేవాళ్ళకు చిన్మయి అదిరిపోయే విధంగా పరోక్షంగా సమాధానం ఇచ్చింది. ‘చెత్త లాజిక్ అలెర్ట్’ అంటూ పోస్ట్ పెట్టింది. రష్మిక పేరు పేర్కొనలేదు. ప్రస్తుతం చిన్మయి పోస్ట్ వైరల్ గా మారింది. ఇక చిన్నయిని ఓ నెటిజన్ తన సమస్యపై స్పందించమని కోరగా షాకింగ్ రిప్లై ఇచ్చింది. సదరు నెటిజన్ హలో చిన్నయ్య గారు నా సమస్యను మీతో పంచుకుంటున్నాను… భార్య గర్భవతిగా ఉన్నప్పుడు లేదంటే డెలివరీ టైమ్ లో ఇతర కారణాల వల్ల భర్తతో ఫిజికల్‌గా కలవరు. అలాంటి సమయంలో వారు బయటి వాళ్లతో రిలేషన్‌షిప్ పెట్టడం లీగలా..!

మా ఇంట్లో అందరూ అతనికే సపోర్ట్ చేస్తున్నారు నేనేం చేయలేకపోతున్నాను… తిరిగి అడిగితే ఓపిక పట్టాలి.. సర్దుకు పోవాలి అని నాకే రివర్స్‌లో చెప్తున్నారు అని ప్రశ్నించింది. దీనిక సంబంధించి చిన్మయి.. వీళ్లే సొసైటీలో నలుగురు ఇదే వాళ్ళ కల్చర్ ఇప్పుడు అర్థమవుతుందా ? ఈ నలుగురికి ఇంపార్టెన్స్ ఇవ్వకూడదని అంటూ సలహా ఇచ్చింది చిన్మయి ఇప్పుడు చిన్మయి చేసిన వ్యాఖ్యలు నెట్టింట చర్చనీయాంశం అవుతున్నాయి.