Green Tea : ప్రతి ఒక్కరు కూడా, ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటుంటారు. అనారోగ్య సమస్యలు ఏమి ఉండకుండా, ఆరోగ్యంగా జీవించాలని అనుకుంటుంటారు. కానీ, ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా, అనేక రకాల అనారోగ్య సమస్యలు కలుగుతున్నాయి. వాటి నుండి బయటపడడం కొంచెం కష్టమే. కానీ, కొంచెం ఆరోగ్యం పై దృష్టి పెడితే, కచ్చితంగా అనారోగ్య సమస్యల నుండి దూరంగా ఉండవచ్చు. అయితే, చాలా మంది ఎక్కువగా ఈ రోజుల్లో అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు.
అధిక బరువు సమస్య నుండి బయటపడేయడానికి, గ్రీన్ టీ బాగా ఉపయోగపడుతుంది. అలానే, గ్రీన్ టీ వలన ఇతర ప్రయోజనాలను కూడా మనం పొందవచ్చు. గ్రీన్ టీ లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. మెటాబాలిజం గ్రీన్ టీ తో పెరుగుతుంది. అలానే, క్యాలరీలు కూడా కరుగుతాయి. గ్రీన్ టీ ని తీసుకోవడం వలన, ఎనర్జీ కూడా పెరుగుతుంది. ఆకలి బాగా తగ్గుతుంది.
రెగ్యులర్ గా గ్రీన్ టీ ని తీసుకోవడం వలన, మెదడు పనితీరు కూడా బాగుంటుంది. మెదడు పని తీరు మెరుగు పడుతుంది. జ్ఞాపకశక్తిని కూడా పెంచుకోవడానికి అవుతుంది. గ్రీన్ టీ ని తీసుకోవడం వలన, ఆల్జీమర్స్ పార్కిన్ సన్స్ వచ్చే, ప్రమాదం కూడా తగ్గుతుంది. గ్రీన్ టీ వలన ఇన్సులిన్ సెన్సిటివిటీ కూడా పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెప్పారు. టైప్ టు డయాబెటిస్ వచ్చే రిస్క్ కూడా తగ్గుతుంది గ్రీన్ టీతో. కాబట్టి, రెగ్యులర్ గా గ్రీన్ టీ ని తీసుకోవడం వలన ఇన్ని లాభాలు పొందడానికి అవుతుంది.
గ్రీన్ టీ ని తీసుకుంటే, ఓరల్ హెల్త్ కి కూడా చాలా మంచిది. డెంటల్ హెల్త్ పై కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. క్యావిటీస్ వచ్చే రిస్క్ బాగా తగ్గుతుంది. దుర్వాసన, దంత క్షయం వంటి సమస్యలు రావు. చిగుళ్ల వ్యాధులు కలిగించే, బ్యాక్టీరియా నీ గ్రీన్ టీ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ తొలగిస్తాయి. దీంతో, ఓరల్ హెల్త్ కి కూడా చాలా మంచిది. వయసు పై బడకుండా, ముడతలు రాకుండా కూడా గ్రీన్ టీ చేస్తుంది. గ్రీన్ టీ ని తీసుకోవడం వలన, జుట్టు కూడా ఊడిపోకుండా ఉంటుంది. క్యాన్సర్ రిస్క్ ని కూడా గ్రీన్ టీ తగ్గిస్తుంది. ఎముకల్ని కూడా దృఢంగా మారుస్తుంది గ్రీన్ టీ. ఇలా, గ్రీన్ టీ ని తీసుకోవడం వలన అనేక లాభాలని పొందడానికి అవుతుంది.
గ్రీన్ టీ ని ఎప్పుడు తాగినా మంచిదే. సాయంత్రం పూట స్నాక్స్ తో పాటుగా అయినా, గ్రీన్ టీ తీసుకోవచ్చని, ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అలానే, తినడానికి ముందు తీసుకోవడం కూడా మంచిదే. ఇలా చేయడం వలన ఏమవుతుంది అంటే, ఆకలి వెయ్యదు. ఎక్కువ తినకుండా, ఉండడానికి అవుతుంది. గ్రీన్ టీ ని తయారు చేసుకోవడానికి ముందు, ఒక టీ బ్యాగ్ ని వేడి నీళ్లలో వేసి, రెండు మూడు నిమిషాలు అలా వదిలేయండి.
ఆ తర్వాత ఈ మిశ్రమంలో, మీరు కొంచెం తేనె, నిమ్మరసం వేసుకొని తీసుకోవడం మంచిది. గ్రీన్ టీ ని ఎంచుకునేటప్పుడు, మంచి బ్రాండ్లని ఎంచుకోవడం మంచిది. గ్రీన్ టీ ని ఎంచుకునేటప్పుడు, అందులో ఉండే పదార్థాల గురించి చూడండి. ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ వంటివి చెక్ చేసుకోండి. అలానే, ఎంత మోతాదు ఎంత ధరకి వస్తుంది అనేది కూడా చెక్ చేసుకోండి. అయితే, గ్రీన్ టీ డైలీ తీసుకోవడం మంచిదే. కానీ, అధికంగా గ్రీన్ టీ ని తీసుకుంటే మాత్రం సైడ్ ఎఫెక్ట్స్ తప్పవు.