ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న బ్యాంకు నుంచి లోన్ తీసుకోవాలని భావిస్తున్నారా… అయితే ఈ విధమైన ఆలోచనలో ఉన్న వారికి ఇది ఒక తీపి కబురు అని చెప్పవచ్చు. అయితే లోన్ తీసుకోవాలనుకునే అభ్యర్థులు తప్పకుండా ముందుగా కొన్ని విషయాలను గుర్తు పెట్టుకోవాలి.ఏ బ్యాంక్ అయితే మనకు తక్కువ వడ్డీతో లోన్ ఇస్తుందో అటువంటి బ్యాంకులనే మనం ఎంపిక చేసుకోవాలి.ప్రస్తుతం అత్యంత తక్కువ వడ్డీకే రుణ సదుపాయాన్ని కల్పిస్తున్న ఈ 10 బ్యాంకులు గురించి తెలుసుకుందాం.
దేశంలోనే అత్యంత పెద్ద బ్యాంకు అయిన భారతీయ స్టేట్ బ్యాంక్ తక్కువ వడ్డీకి రుణాలను అందిస్తోంది. బ్యాంకులో వడ్డీ రేటు 9.6 శాతం నుంచి ప్రారంభమవుతుంది. హెచ్ఎస్బీసీ బ్యాంక్ కూడా 9.75 నుంచి ప్రారంభం అవ్వగా..సిటీ బ్యాంక్ వడ్డీ రేటు 9.99 శాతం నుంచి ప్రారంభమవుతాయి. ఇది మాత్రమే కాకుండా బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా అతి తక్కువ వడ్డీ రేటుకే రుణాలను ఇస్తుంది. బ్యాంక్ ఆఫ్ బరోడాలో వడ్డీ రేటు 10 శాతం నుంచి ప్రారంభమవుతుంది.
ఫెడరల్ బ్యాంక్ 10.49 శాతం వడ్డీ రేటుతో వ్యక్తిగత రుణాలను అందించగా…ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్‌లో పర్సనల్ లోన్స్‌పై వడ్డీ రేటు 10.49 శాతం నుంచి ప్రారంభమవుతుంది. కనుక వ్యక్తిగత రుణాలు పొందాలనుకునే అభ్యర్థులు ముందుగా ఈ బ్యాంకులను సంప్రదించి వీటిలో లోన్ తీసుకోవడం ద్వారా లబ్ధి పొందవచ్చు.