అదిరిపోయే ఫీచ‌ర్ల‌తో విడుద‌లైన గెలాక్సీ ఎఫ్‌22 స్మార్ట్ ఫోన్‌.. ధ‌ర త‌క్కువే..!

July 6, 2021 10:27 PM

శాంసంగ్ సంస్థ గెలాక్సీ ఎఫ్‌22 పేరిట భార‌త్‌లో ఓ నూత‌న స్మార్ట్ ఫోన్‌ను విడుద‌ల చేసింది. ఇందులో అనేక ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. దీంట్లో 6.4 ఇంచుల హెచ్‌డీ ప్ల‌స్ రిజ‌ల్యూష‌న్ క‌లిగిన సూప‌ర్ అమోలెడ్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి 90 హెడ్జ్ రిఫ్రెష్ రేట్ ఉంది. అందువ‌ల్ల డిస్‌ప్లే చ‌క్క‌ని దృశ్యాల‌ను చూపిస్తుంది. ఇంకా ఇందులో ఉన్న ఫీచ‌ర్ల వివ‌రాలు ఇలా ఉన్నాయి.

galaxy f22 smart phone launched by samsung

శాంసంగ్ గెలాక్సీ ఎఫ్22 ఫీచ‌ర్లు

  • 6.4 ఇంచుల హెచ్‌డీ ప్ల‌స్ ఇన్ఫినిటీ-యు సూప‌ర్ అమోలెడ్ డిస్‌ప్లే
  • 1600 x 720 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, 90 హెడ్జ్ రిఫ్రెష్ రేట్
  • ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జి80 ప్రాసెస‌ర్, 4/6 జీబీ ర్యామ్
  • 64/128 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్
  • డ్యుయ‌ల్ సిమ్, ఆండ్రాయిడ్ 11 ఓఎస్, 48, 8, 2, 2 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరాలు
  • 13 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, డాల్బీ అట్మోస్
  • శాంసంగ్ పే మినీ, డ్యుయ‌ల్ 4జి వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0
  • యూఎస్‌బీ టైప్‌సి, 6000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్

శాంసంగ్ గెలాక్సీ ఎఫ్‌22 స్మార్ట్ ఫోన్‌కు చెందిన 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ మోడ‌ల్ ధ‌ర రూ.12,499 ఉండ‌గా, 6జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్ మోడ‌ల్ ధ‌ర రూ.14,499 ఉంది. ఈ ఫోన్‌ను జూలై 13 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో విక్ర‌యిస్తారు. ప్రీ ఆర్డ‌ర్ చేస్తే రూ.1000 డిస్కౌంట్ ల‌భిస్తుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment