తెలంగాణ సీఎం కేసీఆర్ గురించి ప్రత్యేకంగా ఎవరికీ చెప్పాల్సిన పనిలేదు. ఆయన స్టైలే వేరు. ప్రజలకు వరాలను ఇవ్వాలన్నా.. వారిని చలోక్తులు, జోకులతో నవ్వించాలన్నా.. ఆయనను మించిన రాజకీయ నాయకుడు లేరు. అందుకనే రెండోసారి ఆయనను సీఎంను చేశారు. అయితే ఆయనకు కోపం వస్తే మామూలుగా ఉండదు. తాజాగా ఓ చోట జరిగిన కార్యక్రమంలో సీఎం కేసీఆర్‌కు కోపం వచ్చింది. దీంతో ఆయన ఏం చేశారో చూడండి.
తన తనయుడు, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ నియోజకవర్గం సిరిసిల్లలో సీఎం కేసీఆర్ తాజాగా పర్యటించారు. ఇందులో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా మండెపల్లిలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను కేసీఆర్ ప్రారంభించారు. అయితే అన్ని ఏర్పాట్లు చేసిన అధికారులు, నిర్వాహకులు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను ప్రారంభించానికి కత్తెరను ఏర్పాటు చేయడం మరిచిపోయారు.
#WATCH | Telangana Chief Minister K Chandrashekar Rao pulls out ribbon after not getting a pair of scissors for cutting the ribbon, at an inauguration in Medipally of Thangallapally Mandal in Rajanna Sircilla district on Sunday. pic.twitter.com/0KjNCITgy3
— ANI (@ANI) July 5, 2021
ఈ క్రమంలో రిబ్బన్‌ను కట్ చేసి ఇంట్లోకి వెళ్లేందుకు సీఎం కేసీఆర్ కొద్ది సేపు గుమ్మం వద్ద ఆగారు. అయినప్పటికీ కత్తెరను అందించలేకపోయారు. దీంతో కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెంటనే రిబ్బన్‌ను చేత్తో తొలగించి విసిరేసినట్లు పక్కకు వేశారు. కాగా ఆ సమయంలో తీసిన వీడియో వైరల్ గా మారింది.