సాధారణంగా వర్షాకాలంలో ఎక్కువగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడుతుంటాయి.ఈ విధంగా ఉరుములతో కూడిన వర్షాలు పడుతుంటే మనం వీలయినంత వరకు సురక్షితమైన ప్రదేశాలలో ఉండటం ఎంతో అవసరం. ముఖ్యంగా ప్రయాణాలు చేయటం, చెట్ల కింద కూర్చోవడం, రేకుల షెడ్డులో ఉండటం వంటివి అసలు చేయకూడదు. పొరపాటున పిడుగులు పడితే ప్రాణాలను కోల్పోవలసి వస్తుంది. ఈ విధంగా పిడుగులు రోడ్డు పై ప్రయాణిస్తున్న కార్లపై కూడా పడుతుంటాయని చెప్పడానికి ఈ వీడియో మంచి ఉదాహరణగా చెప్పవచ్చు.
అమెరికాలోని కాన్సాస్‌లోని వేవర్లీలో ఐదుగురు కుటుంబసభ్యులు కారులో ప్రయాణిస్తున్నారు. జోరుగా వర్షం కురవడంతో వారు కారును పక్కకు ఆపారు. ఈ క్రమంలోనే ఓ పెద్ద పిడుగు వారి కారుపై పడింది. ఈ విధంగా కారు పై పిడుగు పడిన ఘటన ఆ కారు వెనుక వస్తున్న మరొక కారు డాష్ బోర్డు కెమెరాలో రికార్డయింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆ కారులో వారికి ఏమైంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఈ పిడుగుపాటు కారణంగా కారులో ఉన్నటువంటి ప్రయాణికులకు ఏ విధమైనటువంటి ప్రాణనష్టం జరగలేదు. పిడుగు కారు ఇంజన్ పై పడటం వల్ల ఇంజన్ పాడైపోయింది. మరి ఈ కారు పై పిడుగు పడిన దృశ్యాన్ని ఈ క్రింది వీడియోలో చూడవచ్చు.