Kalyaan Dhev : టాలీవుడ్ మోస్ట్ లవబుల్ కపుల్ సమంత, నాగ చైతన్య ప్రేమించి పెళ్లి చేసుకోగా కొన్నాళ్లకు విడిపోయారు. అయితే విడిపోయే ముందు సమంత ఓ హింట్ ఇచ్చింది. సోషల్ మీడియాలో అక్కినేని పేరు తొలగించింది. ఇక శ్రీజ కూడా తన భర్త పేరు తొలగించడంతో తన రెండో భర్త నుండి విడిపోయిందనే వాదన అయితే నడిచింది.కరోనా సమయంలోనే ఈ ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చినట్టు కనిపస్తోంది. ఫస్ట్ వేవ్ సమయంలో కళ్యాణ్ దేవ్ కరోనా బారిన పడగా, ఆ టైంలో శ్రీజ, కళ్యాణ్ దేవ్‌లు బాగానే ఉన్నారు. కానీ ఆ తరువాతే ఈ ఇద్దరి మధ్యే గ్యాప్ వచ్చింది. క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి సెలెబ్రేషన్స్‌లో కళ్యాణ్ దేవ్ కనిపించకుండా ఉండటంతో విడాకుల రూమర్లు వచ్చేశాయి.
కళ్యాణ్ దేవ్ ని రెండో పెళ్లి చేసుకున్న శ్రీజ.. ఆయనతో కూడా డివోర్స్ తీసుకుందని, అంతేకాదు మూడో పెళ్లికి కూడా రెడీ అయిందనే టాక్ సినీ సర్కిల్స్ లో కొన్నాళ్లుగా జోరుగా వినిపిస్తోంది. దీనికి తోడు సోషల్ మీడియాలో శ్రీజ, కళ్యాణ్ దేవ్ పెడుతున్న పోస్టులు వీళ్ళ విడాకుల ఇష్యూని బలపరుస్తున్నాయి. శ్రీజతో విభేదాలు అనే మ్యాటర్ బయటకొచ్చిన తర్వాత కళ్యాణ్ దేవ్ నటించిన రెండు సినిమాలు విడుదలయ్యాయి. ఈ రెండు చిత్రాలకు మెగా ఫ్యామిలీ కి ఏ మాత్రం సపోర్ట్ ఉండకపోవడం, చిరంజీవితో పాటు మెగా ఫ్యామిలీ సూపర్ మచ్చి, కిన్నెరసాని చిత్రాలను ప్రమోట్ చేయకపోవడం మరిన్ని అనుమానాలకు తెరలేపింది.

అయితే కళ్యాణ్ దేవ్ అప్పుడప్పుడు తన కూతురిని మిస్ అవుతున్నానంటూ పోస్టులు పెడుతుంటాడు. అలా కళ్యాణ్ దేవ్ పెట్టే పోస్టులతోనే విడాకులు కన్ఫామ్ అయిపోయాయని, ఇద్దరూ విడిపోయారని, దూరంగా ఉంటున్నారనే చర్చిస్తూ ఉండగా, మొన్నటి కళ్యాణ్ దేవ్ బర్త్ డే నాడు నవిష్క కనిపించింది. తండ్రీకూతుళ్లిద్దరూ కలిసి ఎంతో సంతోషంగా కనిపించారు. తన కూతురితో సరదగా గడిపాడు.ఇక తాజాగా మనం ఎంతగా ప్రేమిస్తున్నామని కాదు.. వాళ్లు మనల్ని ఎలా ట్రీట్ చేస్తున్నారనేది ముఖ్యం అంటూ చెప్పుకొచ్చాడు.ఇక శ్రీజ.. ప్రేమంటే.. నీతో ప్రేమలో పడేసుకోవడం కాదు.. తనతో తనే ప్రేమలో పడేలా చేయడం.. ఉన్న ప్రేమను గుర్తించాలి.. ప్రేమ కోసం ఎక్కడో వెతకకూడదు అంటూ శ్రీజ పోస్ట్ పెట్టింది. వీరి పోస్ట్‌లని బట్టి చూస్తుంటే ఇద్దరు విడిపోయారనే అనుమానం అందరిలో ఉంది.