Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఈ పేరు చెబితే మెగా అభిమానులు పూనకంతో ఊగిపోతుంటారు. ప్రస్తుతం సినిమాలతో పాటు రాజకీయాలతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ ఇటీవల బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ సీజన్ 2 కి ఇటీవల గెస్ట్ గా వచ్చాడు . ఈ క్రమంలో ఇద్దరి మధ్య చాలా ఆసక్తికర చర్చ నడిచింది. పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ని రెండు భాగాలుగా విడుదల చేశారు. ఇక మొదటి భాగంలో పవన్ కళ్యాణ్ పర్సనల్ విషయాలకు సంబంధించిన ఎన్నో విషయాలను చెప్పుకొచ్చాడు. రెండో పార్ట్ లో భాగంగా ఆయన రాజకీయ జీవితానికి సంబంధించిన విషయాలను పంచుకున్నాడు.. అలానే తన జీవితంలో కొన్ని ముఖ్యమైన విషయాలు బయటపెట్టాడు.
పవన్ కళ్యాణ్ తనకి ఉన్న వ్యాధి గురించి చెప్పుకొస్తూ.. తను 6,7 తరగతిలో ఉన్నప్పుడే ఆస్తమా, జ్వరం వంటి అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడే వారట.అంతేకాదు ఆ టైంలో తన స్నేహితులు కూడా తనతో ఉండకపోవడంతో ఒంటరివాడిగా మిగిలి పుస్తకాలనే తన స్నేహితులుగా మార్చుకొని పుస్తక పఠనం చేసేవారట.అంతేకాదు తన స్నేహితులు,మిగతా వాళ్ళందరూ చదువుకుంటూ ఆటల్లో రాణిస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ మాత్రం ప్రతిసారి ఫెయిలవుతూ ఉండేవారట. ఈ క్రమంలో స్కూల్ కి వెళ్లాలంటే కూడా పవన్ కళ్యాణ్ కి అసలు ఇష్టం ఉండేది కాదట.
స్కూల్లోని టీచర్లను కూడా పవన్ కళ్యాణ్ అసలు ఇష్టపడేవాడు కాదట … ఏ విషయం నైనా ఎవరు చెప్పకుండానే తన సొంతంగా తానే నేర్చుకునే వాడట..ఈ నేపథ్యంలోనే ఆయనకి 17 సంవత్సరాలు ఉన్న సమయంలో మానసికంగా ఒత్తిడికి గురై ఆత్మహత్య కూడా చేసుకోవాలని ప్రయత్నించాడట పవన్ కళ్యాణ్.. ఈ నేపథ్యంలోనే ఆ ఒత్తిడిని భరించలేక చిరంజీవి గన్ తీసుకొని కాల్చుకోవడానికి కూడా సిద్ధం కాగా, ఆ సమయంలో పవన్ కళ్యాణ్ చేతిలో చూసిన సురేఖ మరియు నాగబాబు ఇద్దరు పవన్ కళ్యాణ్ ని తిట్టి ఆ గన్ ని లాక్కున్నారట. అప్పుడు చిరంజీవి దగ్గరకు ఈ విషయం చేర్చగా.. నువ్వు ఎలాంటి చదువు చదవకపోయినా మాకు అవసరం లేదు.. కానీ బ్రతికుంటే చాలు అని చిరంజీవి చెప్పాడట. ఇలా చిన్న వయసులో ఉండగానే పవన్ కళ్యాణ్ ఆత్మహత్య చేసుకోవాలి అనే స్టేజి నుండి ప్రస్తుతం ఎంతోమంది జనాలకు ఆదర్శంగా నిలిచిన వ్యక్తిగా నిలబడడం గోప్ప విషయమే.