టెలికాం సంస్థలు జియో, భారతీ ఎయిర్‌టెల్‌ను ఎలాంటి రోజువారీ డేటా లిమిట్ లేకుండా పలు ప్రీపెయిడ్ ప్లాన్లను ప్రవేశపెట్టిన విషయం విదితమే. ఈ క్రమంలోనే వొడాఫోన్ ఐడియా కూడా అలాంటి ఓ ప్లాన్‌ను తాజాగా ప్రవేశపెట్టింది. రూ.447 కు ఆ ప్లాన్ లభిస్తోంది.
రూ.447 ప్రీపెయిడ్ ప్లాన్‌లో కస్టమర్లకు 50జీబీ డేటా ఉచితంగా లభిస్తుంది. అన్‌లిమిలెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు లభిస్తాయి. ఈ ప్లాన్‌కు 60 రోజుల వాలిడిటీని నిర్ణయించారు. ఇక రోజు వారీ డేటా లిమిట్ లేదు కనుక 60 రోజుల్లోగా 50 జీబీ డేటాను ఎప్పుడైనా, ఎంతైనా వాడుకోవచ్చు.
ఇక ఈ ప్లాన్‌తోపాటు కస్టమర్లకు విఐ మూవీస్ అండ్ టీవీ క్లాసిక్, లైవ్ టీవీ, న్యూస్, మూవీస్, ఒరిజినల్స్ యాప్‌లకు ఉచిత యాక్సెస్ లభిస్తుంది.
జియోలో ఇదే ప్లాన్ రూ.447కు అందుబాటులో ఉండగా ఎయిర్‌టెల్‌లో రూ.456కు ఈ ప్లాన్‌ను అందిస్తున్నారు. అన్నింటిలోనూ దాదాపుగా ఒకేలాంటి బెనిఫిట్స్ లభిస్తాయి.