హోటల్ రుచిని తలపించేలా మష్రూమ్ మంచూరియా ఎలా చేయాలో తెలుసా?

June 24, 2021 3:59 PM

మష్రూమ్స్ తినడానికి రుచి మాత్రమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.అయితే మష్రూమ్ తో వివిధ రకాల రెసిపీ లను తయారు చేసుకుని తింటూ ఉంటాము. సాయంత్రం సమయంలో స్నాక్స్ లాగా మష్రూమ్ మంచూరియా తినడానికి ఎంతో అద్భుతంగా ఉంటాయి. అయితే హోటల్ రుచిని తలపించేలా మష్రూమ్ మంచూరియా ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం..

కావలసిన పదార్థాలు

*మష్రూమ్స్ అరకిలో

*అల్లం వెల్లుల్లి పేస్ట్ టేబుల్ స్పూన్

*కార్న్ ఫ్లోర్ 5 టేబుల్ స్పూన్లు

*మైదాపిండి 2 స్పూన్లు

*సోయా సాస్ టేబుల్ స్పూన్

*చిల్లీ సాస్ టేబుల్ స్పూన్

*టమోటో సాస్ టేబుల్ స్పూన్

*ఉప్పు తగినంత

*కారం టేబుల్ స్పూన్

*ఫుడ్ కలర్ (అవసరమైతే)

*నూనె డీప్ ఫ్రైకి సరిపడినంత

తయారీ విధానం

ముందుగా మష్రూమ్ లను శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. మస్తు ముక్కలపై ఉన్న మొత్తం బాగా ఆరనివ్వాలి. తర్వాత ఒక గిన్నలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, మైదాపిండి, కార్న్ ఫ్లోర్, సోయా సాస్ అర టీ స్పూన్, తగినంత ఉప్పు వేసి కొద్దికొద్దిగా నీళ్లు వేస్తూ ఎక్కడ ఉండలు లేకుండా పకోడీ పిండిలా కలుపుకోవాలి. ఈ విధంగా తయారు చేసుకున్న మిశ్రమంలోకి మష్రూమ్ ముక్కలు వేసి మరోసారి కలపాలి.

తరువాత స్టవ్ మీద కడాయి ఉంచి డీప్ ఫ్రై కి సరిపడా నూనె వేసి నూనె వేడయ్యాక మష్రూమ్ ముక్కలను పకోడీల మాదిరిగా వేసుకుని మష్రూమ్ ముక్కలు బంగారు వర్ణంలోకి వచ్చే వరకు వేయించుకోవాలి. తర్వాత ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని అందులో కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడి అయిన తర్వాత అందులోకి ఒక్కో స్పూన్ చొప్పున టమోటా సాస్, సోయా సాస్, చిల్లి సాస్ ఉప్పు వేసి కలియబెట్టాలి. దీనిలో ముందుగా వేయించి పెట్టుకొన్న మష్రూమ్ మంచూరియా లను వేసి మరోసారి బాగా కలపాలి. ఈ విధంగా మష్రూమ్ మంచూరియా మెత్తబడిన తర్వాత స్టౌ ఆఫ్ చేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉంటాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment