Samantha : ఏమాయ చేసావే మూవీతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది సమంత. ప్రస్తుతం సౌత్ లో తిరుగులేని స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. నార్త్ లో కూడా క్రమంగా సమంత క్రేజ్ పెరుగుతోంది. అయితే గత కొంతకాలంగా సమంత పేరు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. నాగ చైతన్యతో విడాకుల తర్వాత సోషల్ మీడియాలో సామ్‌పై నిత్యం ఏదో ఒక పుకారు వస్తూనే ఉంది. పర్సనల్ లైఫ్‌తోపాటు నటించిన సాంగ్స్, కనిపించే యాడ్స్.. ఇలా ఏదో ఒకరకంగా వార్తల్లో నిలుస్తోంది. అయితే సామ్ మాత్రం ఇవన్నీ లైట్ తీసుకుంది. అంతేకాదు సోషల్ మీడియాకు కొంతకాలంగా దూరంగా ఉంటోంది.
టాలీవుడ్ స్టార్ కపుల్ గా ఉన్న వీళ్ళు విడాకులు తీసుకొని అందరికీ షాక్ ఇచ్చారు. ఎందుకు విడిపోయారు అనే దానిపై సామ్ తన సోషల్ మీడియా ద్వారా ఇన్‌డైరెక్ట్‌గా హింట్స్ ఇస్తుందే తప్ప అసలు విషయం చెప్పడం లేదు. అయితే రీసెంట్ గా అమెరికాలో మాజీ అత్తగారిని కలిసిన సమంత.. ఎందుకు నాగచైతన్య నుంచి విడాకులు తీసుకుందో చెప్పి మైండ్ బ్లోయింగ్ షాక్ ఇచ్చిందట. అసలు విషయం ఏంటంటే.. సమంత, నాగచైతన్య కొంతకాలం వరకు బాగానే ఉన్నారట. కానీ రానురాను సమంతను చైతన్య కంట్రోల్ చేయాలని చూశాడట.

గ్లామరస్ పాత్రలు పరంగానే కాదు.. డ్రెస్సింగ్ స్టైల్ విషయంలో.. మాట్లాడే పద్ధతి.. సినీ ఇండస్ట్రీలో తనకున్న ఫ్రెండ్స్ విషయంలో కంట్రోల్ చేయాలని చూశాడట. దీని గురించి ఇద్దరికీ చాలాసార్లు గొడవ జరిగినా.. చైతన్య మాత్రం మారలేదట. భర్త అనే అహంకారంతో సమంతని టార్చర్ చేయాలని చూశాడని.. ఈ క్రమంలోనే సమంత తన జీవితం తాను నచ్చినట్లు బ్రతకడానికి విడాకులు తీసుకున్నానని.. మొదట విడాకులు అడిగింది తానే అని కూడా సమంత చెప్పుకొచ్చిందట. దీంతో అత్తగారు షాక్ అయిపోయారట. చిన్న ఈగో ప్రాబ్లమ్స్ వల్ల విడాకులు తీసుకున్నారా అంటూ సమంతపై అత్తగారు కోప్పడిందట. ప్రజెంట్ ఈ న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది.