పర్యాటక ప్రాంతంగా ఎంతో అభివృద్ధి చెందిన కేరళలో ఉన్నఫలంగా ఓ దీవి ప్రత్యక్షమైంది. చూడడానికి చుట్టూ పచ్చని వాతావరణంతో పాటు ఎగిసిపడుతున్న అరేబియా సముద్రపు అలలు చూపరులను మంత్ర ముగ్ధుల్ని చేస్తాయి. ఈ విధమైనటువంటి అందమైన ప్రదేశంలో ఉన్నఫలంగా ఒక దీవి పుట్టుకొచ్చింది. ఇన్నిరోజులు ఎక్కడ ఉందో తెలియని దీవి తాజాగా గూగుల్ మ్యాప్ లో ప్రత్యక్షమవడంతో అందరి చూపు ఈ దీవి పైనే పడింది.
కోచీకి పశ్చిమ తీరంలో ఉన్న ఈ దీవి గురించి ఇప్పటివరకు ఎవరికీ తెలియదు. ఎందుకంటే ఈ టీవీ సముద్రపు అడుగున ఉండటంవల్ల ఈ దీవి గురించి ఎవరికీ అవగాహన లేదు. తాజాగా గూగుల్ మ్యాప్ లో ప్రత్యక్షమైన ఈ దీవి కొత్తగా ఏర్పడినదా లేక సముద్ర మట్టాలు పెరగడం వల్ల కనుమరుగైపోయినదా అనే విషయం తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ దీవికీ సంబంధించిన ఫోటోలను ‘చెల్లనం కర్షిక టూరిజం డిపార్ట్‌మెంట్’ అధ్యక్షుడు జావియర్ జులప్పన్ కలిప్పరంబిల్ అనే వ్యక్తి ఈ ఫొటోలను ఫేస్‌బుక్‌లో షేర్ చేయడంతో చర్చనీయమైంది.
చిక్కుడు గింజ ఆకారంలో ఉన్నటువంటి ఈ దీవీ సముద్ర తీరానికి ఏడు కిలోమీటర్ల దూరంలో సుమారు ఎనిమిది కిలోమీటర్ల పొడవు మూడు కిలోమీటర్ల వెడల్పు ఉంటుందని అంచనా వేశారు.అయితే ఈ దీవి గురించి యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ స్పందిస్తూ.. ఈ విధమైనటువంటి దీవిని మేము కూడా గూగుల్ మ్యాప్ లోనే చూశాము. అయితే ఇది ఏ విధంగా ఏర్పడింది అనే విషయం గురించి పూర్తిగా అధ్యయనం చేయాల్సి ఉంటుందని,పూర్తి పరిశోధన తరువాతే ఈ దీవి ఏ విధంగా ఏర్పడిందో తెలిసే అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం ఈ దీవికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.