జబర్దస్త్ యాంకర్‌గానే కాదు, నటిగా కూడా అనసూయ చక్కని గుర్తింపును తెచ్చుకుంది. అడపా దడపా సినిమాల్లో నటిస్తూనే మరోవైపు యాంకర్‌గా కూడా కొనసాగుతోంది. గతంలో కొంత కాలం జబర్దస్త్‌కు దూరమైనా మళ్లీ తన ప్రయాణాన్ని అనసూయ కొనసాగిస్తోంది. అయితే అనసూయ గురించి, ఆమె వేసుకునే దుస్తులపై ఎప్పుడూ కొందరు కామెంట్లు చేస్తుంటారు. కొందరు తీవ్రమైన పదజాలం వాడుతుంటారు. కానీ అనసూయ వాటికి ఎప్పుడూ దీటుగా బదులిస్తూనే ఉంటుంది.
అయితే తాజాగా జబర్దస్త్ సెట్‌పై అనసూయకు అవమానం జరిగింది. యాంకర్ శివ ఆమెను అడగకూడని ప్రశ్న అడిగాడు. మీరెందుకు ఎప్పుడూ చిన్న చిన్న దుస్తులు వేసుకుంటారు ? అని శివ అడగ్గా.. అందుకు అనసూయ బదులిస్తూ.. ఇతరులు అంటే తనను విమర్శించేందుకు అలా అడుగుతారు, మీరు కూడా ఇలా అడిగితే ఎలా ? అది నా పర్సనల్ విషయం అని చెప్పింది.
అయితే అందుకు శివ మళ్లీ స్పందిస్తూ.. పర్సనల్ అయితే ఇంట్లో చూసుకోవాలి కానీ బయట ఇలా చేస్తే ఎలా ? అని ప్రశ్నించాడు. ఇందుకు అనసూయ జబర్దస్త్ సెట్ నుంచి వెళ్లిపోయింది. అన్నీ మీకు తెలియకుండానే జరుగుతున్నాయా ? అంటూ అక్కడి నుంచి బయటకు వెళ్లింది. దీంతో సెట్‌లో ఉన్న అందరూ షాక్‌కు గురయ్యారు. జబర్దస్త్ కమెడియన్లు ఆమెను ఓదార్చే ప్రయత్నం చేశారు. ఈ దృశ్యాలను మనం జబర్దస్త్ షో లేటెస్ట్ ప్రోమో వీడియోలో చూడవచ్చు. అయితే ఇది కేవలం పబ్లిసిటీ కోసమేనా ? నిజంగానే అనసూయ వెళ్లిపోయిందా ? అనే వివరాలు తెలియాలంటే గురువారం ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.