India Daily Live
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
No Result
View All Result
India Daily Live
Home ఆరోగ్యం

Triphala Churnam : త్రిఫ‌ల చూర్ణం.. ఉద‌యం, సాయంత్రం 5 గ్రాములు.. షుగ‌ర్‌, బ‌రువు అన్నీ త‌గ్గుతాయి..!

Mounika by Mounika
Saturday, 1 October 2022, 1:04 PM
in ఆరోగ్యం, వార్తా విశేషాలు
Share on FacebookShare on Twitter

Triphala Churnam : త్రిఫల చూర్ణం అనేది ఆయుర్వేద ఔషధం. ఈ ఔషధం మన పూర్వీకుల నుండి వారసత్వంగా లభిస్తున్న సర్వరోగ నివారిణి. త్రిఫల చూర్ణాన్ని ప్రకృతి సిద్ధమైన యాంటీ బ‌యోటిక్ అని కూడా పిలుస్తారు. మన దేహంలోని విషపదార్థాలను శుభ్రం చేయడంలో ఈ త్రిఫల చూర్ణం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఉసిరి, కరక్కాయ, తానికాయలతో తయారుచేసిన ఈ మిశ్రమాన్నే త్రిఫల‌ చూర్ణం అని అంటారు. త్రిఫల చూర్ణంలో ఉన్న ఉసిరికి చలువచేసే గుణం కలిగి ఉంటుంది. ఉసిరిలో ఫైబర్ అధికంగా ఉండటం వలన మలబద్ధకం సమస్యను నివారిస్తుంది. అదేవిధంగా కరక్కాయ కాలేయానికి సంబంధించిన భయంకర వ్యాధుల నుంచి దూరం చేస్తుంది. అంతేకాకుండా నాడీ సంబంధిత వ్యాధులను నివారిస్తుంది. తానికాయ అజీర్తి సమస్యతో బాధపడేవారికి జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది.

ఈ మూడు కలిసిన  త్రిఫల చూర్ణంగా మానవ శరీర ఆరోగ్యం కాపాడడంలో ప్రముఖపాత్ర వహిస్తుంది. వాత, పిత్త, కఫ దోషాలను నియంత్రిస్తుంది. వాతం నాడీవ్యవస్థకు, పిత్తం జీవన క్రియలకు, కఫం శారీరక నిర్మాణానికి సహాయపడతాయి. ఈ మూడింటినీ మెరుగుపరిచే గుణం త్రిఫల చూర్ణానికి ఉంది. అందుకనే ఈ త్రిఫల చూర్ణాన్ని నేటికీ కూడా అనేక ప్రాంతాల్లో ప్రతి రోజూ సేవిస్తారు. మన శరీరంలో వాత, పిత్త, కఫ దోషాలు ఎప్పుడైతే సక్రమంగా పనిచేస్తాయో మనిషి ఆరోగ్యంగా సరైన బరువులో ఉంటాడు. ఈ మూడు దోషాలు మన శరీరంలో సక్రమంగా పనిచేయవో మనిషి అధిక బరువు పెరగడం అనే ప్రక్రియ మొదలవుతుంది. అధిక బరువుతో బాధపడుతున్నవారు త్రిఫల చూర్ణం తీసుకోవడం ద్వారా బరువు నియంత్రణలోకి వస్తుంది.

Triphala Churnam very beneficial in this conditions
Triphala Churnam

100 గ్రాముల త్రిఫల చూర్ణం తీసుకుంటే 52 గ్రాములు కార్బొహైడ్రేట్స్ 38 గ్రాములు ఫైబర్ ఉంటాయి. ఈ త్రిఫల చూర్ణం ఔషధం బరువు తగ్గించడంలో ఎలా పని చేస్తుంది అనే పరిశోధన చేశారు. బరువు తగ్గడానికి త్రిఫల చూర్ణం ఎలా ఉపయోగపడుతుందని పరిశోధన చేస్తే 64 మంది, మరొక 64 మంది రెండు గ్రూప‌ల‌కు చెందిన వారి బరువుపైన పరిశోధన ప్రారంభించి 2012లో షాహిద్ యూనివర్సిటీ వీరిద్దరికీ సమానంగా వ్యాయామం, డైట్ సమానంగా చేయించారు.

మొదటి 64 మందికి ఐదు గ్రాముల‌ త్రిఫల చూర్ణాన్ని ఉదయం, సాయంత్రం ఇచ్చేవారు. మరొక అరవై నాలుగు మందికి త్రిఫల చూర్ణం కాకుండా హెర్బల్ పౌడర్ ఇచ్చేవారు. మూడు నెలల పాటు ఇదే విధంగా ఇస్తే త్రిఫల తీసుకున్న 64 మంది, త్రిఫల చూర్ణం తీసుకోని 64 మంది కంటే ఐదు కేజీలు బరువు తగ్గారు అని పరిశోధనలో వెల్లడయింది. ఈ త్రిఫల బరువు తగ్గడానికి సైంటిఫిక్ గా పరిశోధన చేస్తే కణం లోపల ఆహార పదార్థాలను బాండ్ చేసే మైటోకాండ్రియాలు మెటబాలిజంని పెంచి బరువు తగ్గడానికి తోడ్పడుతుంది. ఇక రెండో పరిశోధన 2012లో హైదరాబాదులో బిట్స్ పిలాని క్యాంపస్ లోఎలుకల పైన పరిశోధన చేశారు.

ఈ త్రిఫల చూర్ణం నిత్యం తీసుకోవడం వలన  బ్లడ్‌ లో షుగర్ లెవెల్ పెరగడం లేదు అని ఈ పరిశోధన ద్వారా తేలింది.  దీనికి గల కారణం మనం తీసుకునే ఆహారంలో కార్బొహైడ్రేట్స్ ఉంటాయి. తీసుకున్న ఆహారంలో కాంప్లెక్స్ కార్బొహైడ్రేట్స్, సింపుల్ కార్బొహైడ్రేట్స్ గా మారితేనే గ్లూకోజ్ గా తయారవుతుంది. కాంప్లెక్స్ కార్బొహైడ్రేట్స్ సింపుల్ కార్బొహైడ్రేట్స్ గా మారడానికి అవసరమయ్యే ఆల్ఫా అమైలేజ్ అనే కణాలు గ్లూకోజ్ ని తయారుచేయడంలో ఉపయోగపడుతుంది. అప్పుడు కార్బొహైడ్రేట్స్ ని గ్లూకోజ్ గా మారుస్తుంది. కాబట్టి ఈ ఆల్ఫా అమైలేజ్ ని త్రిఫల చూర్ణం తగ్గిస్తుంది. డయాబెటిస్ పేషెంట్స్ ఉదయం, సాయంత్రం ఐదు గ్రాముల చొప్పున త్రిఫల చూర్ణాన్ని వేడి నీటిలో కలుపుకొని త్రాగడం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ తగ్గడానికి సహకరిస్తుంది.

Tags: Triphala Churnam
Previous Post

Allu Studios : ఒక్క కార్య‌క్ర‌మంతో పుకార్ల‌కు చెక్‌.. అల్లు స్టూడియోస్‌ను ప్రారంభించిన చిరంజీవి..!

Next Post

Aishwarya Rajinikanth : విడాకులు క్యాన్సిల్‌.. మ‌ళ్లీ క‌ల‌సి జీవించ‌బోతున్న ధ‌నుష్, ఐశ్వ‌ర్య ర‌జ‌నీకాంత్‌..?

Related Posts

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..
Jobs

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

Sunday, 2 March 2025, 2:33 PM
యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..
Jobs

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

Saturday, 22 February 2025, 10:19 AM
భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!
Jobs

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

Friday, 21 February 2025, 1:28 PM
బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..
Jobs

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

Thursday, 20 February 2025, 5:38 PM
టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..
Jobs

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

Tuesday, 18 February 2025, 5:22 PM
ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!
Jobs

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

Monday, 17 February 2025, 9:55 PM

POPULAR POSTS

వినాయ‌కుడి పూజ‌లో వాడే 21 ర‌కాల ప‌త్రి ఇవే.. పేర్ల వివ‌రాలు.. ఫొటోల‌తో స‌హా చూడండి..!!
ఆధ్యాత్మికం

వినాయ‌కుడి పూజ‌లో వాడే 21 ర‌కాల ప‌త్రి ఇవే.. పేర్ల వివ‌రాలు.. ఫొటోల‌తో స‌హా చూడండి..!!

by IDL Desk
Thursday, 9 September 2021, 3:05 PM

...

Read more
ప్రతి రోజూ ఈ ధన్వంతరి మంత్రాన్ని పఠించండి.. వ్యాధులు నయం అవుతాయి..!
ఆధ్యాత్మికం

ప్రతి రోజూ ఈ ధన్వంతరి మంత్రాన్ని పఠించండి.. వ్యాధులు నయం అవుతాయి..!

by IDL Desk
Tuesday, 18 January 2022, 8:20 PM

...

Read more
ఈ స్తోత్రాన్ని చదువుకుంటే.. ఎంతటి అనారోగ్య సమస్య నుండి అయినా బయటపడవ‌చ్చు..!
ఆధ్యాత్మికం

ఈ స్తోత్రాన్ని చదువుకుంటే.. ఎంతటి అనారోగ్య సమస్య నుండి అయినా బయటపడవ‌చ్చు..!

by Sravya sree
Tuesday, 29 August 2023, 10:42 AM

...

Read more
డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..
Jobs

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

by IDL Desk
Sunday, 2 March 2025, 2:33 PM

...

Read more
భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!
Jobs

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

by IDL Desk
Friday, 21 February 2025, 1:28 PM

...

Read more
యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..
Jobs

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

by IDL Desk
Saturday, 22 February 2025, 10:19 AM

...

Read more
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© BSR Media. All Rights Reserved.

No Result
View All Result
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు

© BSR Media. All Rights Reserved.