Krishnam Raju Sabha : అతిథి మర్యాదలకు పెట్టింది పేరైన కృష్ణం రాజు ఫ్యామిలీలో ఇప్పుడు ప్రభాస్ కూడా ఆ వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. తన పెదనాన్న నట వారసత్వాన్ని మాత్రమే కాకుండా అతిథి మర్యాదల్లో కూడా ఆయన ఆనవాయితీలను పాటిస్తున్నారని అందరూ ప్రభాస్ వ్యక్తిత్వాన్ని కొనియాడుతున్నారు. ఈ మధ్యే కృష్ణం రాజు మరణంతో ఆయన అభిమానులు తీవ్ర దుఃఖంలో ఉన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఆయన సొంత ఊరైన మొగల్తూరులో ఎంతో మంది ఆయన మరణం పట్ల బాధలో ఉన్నారని తెలిసింది.
ఈ క్రమంలోనే ఎప్పుడూ తన ఊరు వెళ్లని ప్రభాస్ కూడా అతని పెదనాన్న జ్ఞాపకార్థం ఆయన సంస్మరణ సభను ఏర్పాటు చేసి అభిమానులను ఓదార్చడానికి సిద్ధమయ్యారని చెబుతున్నారు. దీనిలో భాగంగానే ప్రభాస్ అక్కడి అభిమానులకు భోజన ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇప్పడు దీనిపైనే అంతటా చర్చ జరుగుతుంది. తన మర్యాదలతో అందరినీ ఉక్కిరి బిక్కిరి చేసే ప్రభాస్ ఇప్పుడు తనేంటో మరొక్కసారి నిరూపిస్తున్నాడని అంటున్నారు.

ఈ సభకు హాజరయ్యే అభిమానుల కోసం ప్రభాస్ భారీ ఎత్తున భోజన ఏర్పాట్లు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. టన్నుల కొద్దీ మటన్, చికెన్, చేపలు, రొయ్యలు ఇంకా వివిధ రకాల వంటలతో ఎటువంటి లోటు రాని విధంగా చేయనున్నారని సమాచారం అందుతుంది. దాదాపు లక్ష మందికి వంటలు సిద్దం చేస్తున్నారని చెబుతున్నారు. ఇందులో భాగంగాగానే భారీ ఎత్తున పెద్ద పెద్ద పాత్రల్లో వంటలు చేస్తున్న వీడియోలు సోసల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అన్ని ఛానళ్లకు చెందిన మీడియా ప్రతినిధులందరూ ఈ విందు గురించి చాలా గొప్పగా చెప్పడం జరుగుతోంది. ఏదేమైనా రాజుల కుటుంబానికి చెందిన ప్రభాస్ వ్యక్తిత్వంలోనూ రాజుననే నిరూపిస్తున్నాడని అందరూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు.
రాజువయ్య , మహారాజువయ్య నీ లాంటోడు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి అయ్యా ……!! 🙌🤲🕋🙏#Mogalthuru @PrabhasRaju food preparation for fans 🙏 pic.twitter.com/gaXBXPEfEs
— ⚔️GHANI 🦅 (@BheemlaBoy1) September 29, 2022