Janhvi Kapoor : అతిలోకసుందరి శ్రీదేవి వారసురాలిగా ఫిల్మ్ ఎంట్రీ ఇచ్చింది జాన్వీ కపూర్. ధడక్ అనే మూవీతో బాలీవుడ్ కు పరిచయమైంది. ఆ సినిమా హిట్ తర్వాత జాన్వీ పలు బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తూ బిజీ అయ్యింది. జాన్వీ తన తల్లి శ్రీదేవిని పోలిన లుక్స్‌తో అభిమానులకు కనువిందు చేస్తోంది. నటనలో తల్లికి తగ్గ కూతురుగా పేరు తెచ్చుకుంతుంది. జాన్వీ ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ఓ సందర్భంలో బోనీ కపూర్ మాట్లాడుతూ.. మాకు దక్షిణాది చిత్ర పరిశ్రమ అంటే ఎంతో అభిమానం.
ఇక్కడ సినిమాల్లో నటించడంతోనే శ్రీదేవి ఆల్ ఇండియా లేడీ స్టార్‌గా సత్తా చాటిన విషయాన్ని కూడా పలు సందర్భాల్లో ప్రస్తావించాడు. మంచి కథ దొరికితే.. తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో జాన్వీ తప్పకుండా నటిస్తుందని చెప్పుకొచ్చాడు. జాన్వీ కపూర్ విషయానికొస్తే.. తన అందం, ఫోటో షూట్‌లతో పాటు అప్పుడపుడు వెకేషన్ కు సంబంధించిన ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఫాలోయింగ్‌ను మరింత పెంచుకుంటోంది.

దీంతో ఆమె ఫోటోస్, వీడియోస్ ఎప్పటికప్పుడు ట్రెండ్ అవుతున్నాయి. తాజాగా జాన్వీ కపూర్ జిమ్ కి వెళ్తుండగా కెమెరాలకు చిక్కింది. దీంతో ఈమెను ఫోటోలు వీడియోలు తీసేందుకు ఎగబడ్డారు. జిమ్ డ్రెస్ లో జాన్వీ అందాలు చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు. మోకాళ్ళపై వరకు ఉన్న ఆ డ్రెస్ లో జాన్వీ సో హాట్ గా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. జాన్వీ ప్రెసెంట్ రూహీ, తక్త్, గుడ్ లక్ జెర్రీ, హెలెన్ మొదలగు సినిమాల్లో నటిస్తోంది.
https://www.youtube.com/watch?v=44_gSMVhqro