Nithya Menen : అలా మొదలైంది సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైంది నిత్యామీనన్. అందం, అభినయంతో ఫస్ట్ మూవీతోనే ప్రేక్షకులకు ఆకట్టుకుంది. ఆ తర్వాత తెలుగులో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, జనతా గ్యారేజ్ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ.. ఇటీవల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన భీమ్లా నాయక్ మూవీలో మెరిసింది. నిత్యా మీనన్ తన పాత్రకు ప్రాధాన్యం ఉన్న కథలనే ఓకే చేస్తోంది.
గ్లామర్ గాల్‌గా కంటే అభినయం ఉన్న పాత్రలకే ఓటేస్తోంది. అందుకే ఆమె తెలుగు ప్రేక్షకులకు చేరువ అయింది. ఆమె నటించిన సినిమాలు ప్రేక్షకులకు ఎక్కువ కాలం గుర్తుండిపోయేలా చేశాయి. అయితే తాజాగా నిత్యా మీనన్ ఓ అమ్మాయితో లిప్ లాక్ చేసిన వ్యవహారం బయటకు వచ్చింది. అదీ కారులో, బట్టలు విప్పేసి మరీ.! అసలేమయ్యింది.. నిత్యామీనన్ ఏంటీ, అలా చేయడం ఏంటీ.. అనే కదా మీ అనుమానం.. అయితే.. అది మీ తప్పు కాదు.!

ఇంతకీ విషయమేంటంటే, హిందీలో తెరకెక్కిన ఓ వెబ్ సిరీస్‌లో నిత్యామీనన్ నటించింది. ఇందులో బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ ఓ కీలక పాత్రలో నటించాడు. ఓ సన్నివేశంలో కారులో నిత్యామీనన్ బీభత్సమైన రొమాన్స్ చేసింది. అది కూడా మరో యువతితో.. ఆ నటి పేరు శృతి. బట్టలు విప్పేసి మరీ నిత్యామీనన్, శృతి గాఢమైన లిప్ లాక్ సీన్ లో మునిగి తేలారు. ఇప్పుడీ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. మరి నిత్యామీనన్ ఇంతలా ఎందుకు రెచ్చిపోయింది అంటే, వెబ్ సిరీస్ లో భాగంగా నిత్య అలా చేయాల్సి వచ్చిందనగానే ఓహ్ ఇంతేనా అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.