కృష్ణపక్ష అమావాస్య జూన్ 10 వ తేదీన వస్తుంది. ఈ అమావాస్య రోజు సూర్య గ్రహణం ఏర్పడటం వల్ల ఈ అమావాస్యకు ఎంతో ప్రత్యేకత ఉంది. సాధారణంగా 72 సంవత్సరాల కొకసారి కనిపించేటటు వంటి సూర్యగ్రహణం ఈ ఏడాది జూన్ పదవ తేదీన ఏర్పడింది. ఈ సూర్యగ్రహణం భారతదేశంలో మినహా
మంగోలియా, నెదర్లాండ్స్, నార్వే, పోలాండ్, పోర్చుగల్, రొమేనియా, రష్యా, స్పెయిన్, స్వీడన్, స్విట్జర్లాండ్, ఇంగ్లాండ్, అమెరికా వంటి దేశాలలో సూర్య గ్రహణ ప్రభావం అధికంగా ఉండనుంది.
ఈ ఏడాదిలో ఏర్పడిన మొట్టమొదటి సూర్యగ్రహణం పాక్షిక సూర్యగ్రహణం. ఈ సూర్యగ్రహణాన్ని రింగ్ ఆఫ్ ఫైర్ అని కూడా పిలుస్తారు.ఈ విధమైనటువంటి సూర్య గ్రహణం ఏర్పడేటప్పుడు చంద్రుడు పూర్తిగా అడ్డు రావడం వల్ల సూర్యుడు మనకు కేవలం రింగు ఆకారంలో మాత్రమే కనిపిస్తాడు.ఈ విధమైనటువంటి పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడిన ప్రదేశాలలో అధిక దుష్ప్రభావాలు ఏర్పడతాయని పండితులు చెబుతున్నారు.
జూన్ 10 వ తేదీన ఏర్పడే సూర్య గ్రహణం శని, బుధుడు తిరోగమనం చెందుతారు. అదేవిధంగా సూర్యుడు, బుధుడు, చంద్రుడు, రాహుల శుభ కలయిక కూడా ఏర్పడుతోంది. ఇది చాలా అరుదైన కలయిక కావటంవల్ల ఇది అమావాస్య ఎంతో ప్రత్యేకమైనది. ఎంతో ప్రత్యేకమైన ఈ అమావాస్య రోజు శని జయంతి సావిత్రి వ్రతం ఉండటం వల్ల దీనిని మరింత ప్రత్యేకంగా భావిస్తారు. గ్రహాల మార్పుల వల్ల గ్రహణం రోజు రోజు వివిధ రాశుల వారికి అదృష్టం పంట పండినట్లే అవుతుందని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా మేషం, మిధున, కర్కాటక రాశి, కన్య, మీనం, తుల, మకరరాశి ఈ 7 రాశుల వారికి రాజయోగం పడుతుందని పండితులు తెలియజేస్తున్నారు.