ఈ ఏడాది జూన్ 10వ తేదీ మొట్టమొదటిసారిగా సూర్య గ్రహణం ఏర్పడుతుంది. జూన్ 10 న ఏర్పడే సూర్య గ్రహణం పాక్షిక సూర్య గ్రహణం. దీనినే రింగ్ ఆఫ్ ఫైర్ అని కూడా పిలుస్తారు. ఈ విధమైనటువంటి సూర్య గ్రహణం ఏర్పడినప్పుడు గ్రహణ ప్రాంతాలలో తీవ్ర దుష్ప్రభావాలు ఉంటాయి .అందుకోసమే గ్రహణ సమయంలో ఎవరూ కూడా బయటకు రాకూడదు. మరి జూన్ పదవ తేదీన చంద్రగ్రహణం ఏ సమయంలో ప్రారంభమై ఎప్పుడు ముగుస్తుందో తెలుసుకుందాం.
జూన్ 10వ తేదీ గురువారం సూర్యగ్రహణం ఏర్పడుతుంది. సూర్యగ్రహణం మధ్యాహ్నం 1:42 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6:41 గంటలకు ముగుస్తుంది. అయితే ఈ సూర్యగ్రహణం ప్రభావం మనకు భారత దేశంలో ఎక్కడా కనిపించదు. కనుక మనం రోజువారి పూజా కార్యక్రమాలను పనులను చేసుకోవచ్చు. అయితే మన దేశంలో గ్రహణం లేకపోయినప్పటికీ గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా ఉండాలి.
ఈ గ్రహణ సమయంలో ఎవరు కూడా ఎటువంటి ఆహార పదార్థాలను సేవించకూడదు. అదేవిధంగా పూజ గదిని పూర్తిగా మూసివేయాలి. గ్రహణ సమయంలో చిన్న పిల్లలు, గర్భిణి స్త్రీలు బయట తిరగకూడదు. అదేవిధంగా సూర్యగ్రహణ సమయంలో మనసులోనే ఇష్టదైవాన్ని తలుచుకుంటూ ఉండాలి.