Prabhas : అద్వైత్ చందన్ దర్శకత్వంలో బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ హీరోగా నటించిన చిత్రం లాల్ సింగ్ చడ్డా. ఆగస్టు 11న ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ థియేటర్లలో విడుదలైంది. అయితే హాలివుడ్ సూపర్ హిట్ మూవీ ఫారెస్ట్ గంప్ ని రీమేక్ చేయడంలో విఫలం అవడంతోపాటు గతంలో ఇండియాపై అమీర్ ఖాన్ చేసిన వాఖ్యలకి ప్రతీకారంగా బాయికాట్ లాల్ సింగ్ చడ్డా అనే హాష్ టాగ్ ని ట్రెండ్ చేయడంతో.. ఈ సినిమా విజయంపై ఉన్న అంచనాలు తలకిందులయ్యాయనే చెప్పవచ్చు. విడుదల అయిన రెండో రోజునే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి.
ఇక ప్రభాస్ ఈ చిత్ర విడుదల కోసం తన ఆదిపురుష్ సినిమాని వాయిదా వేసి తప్పు చేసినట్లుగా చెబుతున్నారు. మొదట ఈ చిత్రాన్ని కూడా ఆగస్టు 11న రిలీజ్ చేయడానికి నిర్ణయించారు. కానీ అమీర్ ఖాన్ సినిమా కోసం తన సినిమాని ప్రభాస్ వాయిదా వేసినట్లుగా తెలియజేశారు. కానీ వరుస సెలవు రోజులు రావడంతో సినిమా విడుదలకు మంచి సమయమని ప్రభాస్ సరైన అవకాశాన్ని చేజార్చుకున్నాడని.. సినీ వర్గాల అభిప్రాయంగా తెలుస్తోంది.

ఒక ఫ్లాప్ మూవీ కోసం ఇలా త్యాగం చేయాల్సిన అవసరం లేదని అంటున్నారు. అయితే వరుస హాలిడేస్ లో సినిమా విడుదలకు ఎంతో లాభదాయకమని, ఆ అవకాశం వృథా అయిందని సినీ వర్గాలు విమర్శిస్తున్నాయి. ఈ సంఘటనని ప్రభాస్ అభిమానులు కూడా వ్యతిరేకిస్తున్నారని తెలుస్తోంది. దీనిపై సోషల్ మీడియాలో కూడా రకరకారాల మీమ్స్ ను షేర్ చేస్తున్నారు.
ఇక ప్రస్తుతం ప్రభాస్ సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే లేటెస్ట్ గా ఈ సినిమాపై ఆగస్టు 15న ఒక ఆసక్తికరమైన అపడేట్ రానున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. దీని కోసం అభిమానులు కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నారు.