చికెన్ మటన్ అంటూ ఎన్నో రెసిపీలు చేస్తుంటారు. ఈ క్రమంలోనే చాలామంది మటన్ మసాలా గ్రేవీ తినడానికి ఇష్టపడుతారు. మరి ఆంధ్ర స్టైల్ మటన్ మసాలా గ్రేవీ ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.
కావలసిన పదార్థాలు
*మటన్ అరకిలో
*ఉల్లిపాయ ఒకటి
*వెల్లుల్లి చిన్న సైజు ఒక్కటి
*ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి
*టేబుల్ స్పూన్ కారం పొడి
*కొత్తిమీర
*కొబ్బరి తురుము రెండు టేబుల్ స్పూన్లు
*అల్లం తురుము టేబుల్ స్పూన్
*లవంగాలు 4
*ఎండుమిర్చి 2
*ఆవాలు, జీలకర్ర అర టేబుల్ స్పూన్
*కరివేపాకు రెమ్మ
*నూనె 2 టేబుల్ స్పూన్లు
*ఉప్పు తగినంత
*పసుపు చిటికెడు
తయారీ విధానం
ముందుగా మిక్సీ గిన్నెలో వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు, ధనియాల పొడి, లవంగాలు, కొబ్బరి తురుము, అల్లం, కొత్తిమిర వేసి మెత్తని మిశ్రమంలా తయారు చేసుకోవాలి. తరువాత మటన్ శుభ్రం చేసుకొని స్టవ్ పై కుక్కర్ పెట్టి కొద్దిగా నూనె వేయాలి. నూనె వేడెక్కిన తరవాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. ఆవాలు చిటపట అన్న తరువాత మటన్ వేసి బాగా కలుపుకోవాలి.రెండు నిమిషాల పాటు మటన్ నూనెలో నటించడం వల్ల మాటల్లో ఉన్న నీటి శాతం వెళ్ళిపోతుంది.
రెండు నిమిషాల పాటు బాగా మగ్గిన తర్వాత అందులోకి రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు పసుపు వేసి బాగా కలపాలి. మరో రెండు నిమిషాల పాటు వేయించిన తరువాత ముందుగా తయారు చేసుకొన్న మసాలా వేయాలి. తక్కువ మంటపై మసాలాను ఒక ఐదు నిమిషాలు పాటు మగ్గనివ్వాలి.తర్వాత కారం పొడి వేసి రెండు నిమిషాలు మరిగిన తర్వాత తగినంత నీరు వేసి కుక్కర్ మూత పెట్టాలి. సుమారు ఆరు విజిల్స్ వచ్చిన తర్వాత స్టౌ ఆఫ్ చేసి ప్రెజర్ మొత్తం వెళ్లి వరకు ఉండి తర్వాత కుక్కర్ మూత తీసి మరో రెండు నిమిషాల పాటు సిమ్ లో మటన్ ఉడికించు కుంటే మటన్ మసాలా గ్రేవీ తయారైనట్టే.