Samantha : బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ ఇటీవల నిర్వహించిన కాఫీ విత్ కరణ్ షోకు చెందిన సీజన్ 7 ఎపిసోడ్ 3లో సమంత, అక్షయ్ కుమార్‌లు హాజరైన సంగతి తెలిసిందే. అయితే సమంతను ఆమె వైవాహిక జీవితానికి సంబంధించిన ప్రశ్నలను కరణ్ జోహార్ అడిగాడు. దీంతో ఆమె ముక్తసరిగా సమాధానాలు చెప్పింది. అంతేకాకుండా.. కరణ్ ఓ సందర్భంలో మీ భర్త అని సంబోధించగా.. కాదు.. మాజీ భర్త అనాలని సమంత చెబుతుంది. దీంతో కరణ్ సారీ చెప్పి అలాగే మాజీ భర్త అని కంటిన్యూ చేస్తాడు. అయితే ఈ విధంగా సమంత ప్రవర్తించడం చైతన్య అభిమానులకు నచ్చడం లేదు. ఆమెపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆమెను భారీగా ట్రోల్ చేస్తున్నారు.
చైతన్య వాస్తవానికి తన థాంక్ యూ మూవీ ప్రమోషన్లలో సమంత పేరు వచ్చినా చాలా కూల్‌గానే సమాధానాలు చెప్పాడు. అంతేకానీ సమంతలా విసుగు, కోపం చెందలేదు. కానీ సమంత అతని గురించి మాట్లాడినప్పుడు మాత్రం కాస్త విసుగు, కోపం ప్రదర్శించింది. దీంతో నీకు, ఆయనకు తేడా అదే.. అంటూ అక్కినేని అభిమానులు సమంతను ట్రోల్ చేస్తున్నారు. ఆమెను భారీగా విమర్శిస్తూ.. పెద్ద ఎత్తున ఆమెకు వ్యతిరేకంగా నెగెటివ్ కామెంట్లు పెడుతున్నారు. చైతన్య ఎలా డీసెంట్‌గా ఉన్నాడు.. నువ్వు ఏ విధంగా మాట్లాడుతున్నావు.. కనీసం భర్త అని కూడా అనకుండా మాజీ భర్త అనమని అంటున్నావు.. నీకు చాలా పొగరు.. అంటూ నెటిజన్లు ఆమెను విమర్శిస్తున్నారు.

ఇక చైతన్య ఈమధ్య ఇచ్చిన ఇంటర్వ్యూల్లో ఎక్కడైనా సరే సమంత గురించి ప్రశ్నలు ఎదురైతే చాలా కూల్‌గానే బదులిచ్చాడు. కానీ ఆమెలా విసుగు చెందలేదు. ఇదే అక్కినేని అభిమానులకు కోపం తెప్పిస్తోంది. ఇక తన ఇంటర్వ్యూలో భాగంగా సమంత మాట్లాడుతూ విడాకుల అనంతరం తాను కష్టాలను ఎదుర్కొంటున్నానని చెప్పింది. ఇక చైతన్య నటించిన థాంక్ యూ బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్‌ను రాబట్టగా.. త్వరలో సమంత యశోద మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది.