Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. ఈ పేరు చెబితే చాలు.. అభిమానులకు పూనకాలు వస్తాయి. ఇక ఆయన సినిమా వస్తుందంటే చాలు.. ఫ్యాన్స్‌కు పండగే. పవన్ హీరో అంటే సినిమా మినిమమ్ గ్యారంటీ అన్న టాక్ కూడా ఉంటుంది. ఈ మధ్యే ఆయన భీమ్లా నాయక్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే పవన్ ప్రస్తుతం ఏపీలో రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అక్కడ రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉంటున్నారు. అనేక చోట్ల ఆయన పర్యటిస్తూ ప్రజల కష్ట సుఖాలను అడిగి తెలుసుకుంటున్నారు. దీంతోపాటు అవసరం ఉన్న వారికి ఆయన సహాయం కూడా చేస్తున్నారు.
ఇక పవన్ కల్యాణ్ ఆస్తుల విషయానికి వస్తే.. ఆయన తనకు రూ.180 కోట్ల ఆస్తి ఉందని చెప్పారు. ఈ విషయాన్ని ఆయన గతంలో స్వయంగా వెల్లడించారు. అయితే హిట్ అయినా ఫ్లాప్ అయినా పవన్ రెమ్యునరేషన్ ఒకటే విధంగా ఉంటుందని అనుకుంటారు. కానీ అది నిజం కాదు. హిట్ అయితే లాభాలు తీసుకుంటారు. ఫ్లాప్ అయితే రెమ్యునరేషన్ వెనక్కి ఇచ్చేస్తారు. కనుకనే ఆయనతో సినిమాలు చేసేందుకు నిర్మాతలు ఆసక్తిని చూపిస్తుంటారు. అందుకనే ఆయన అసలు కథ ఓకే చేయకపోయినా ఆయనకు ముందుగా నిర్మాతలు అడ్వాన్స్ ఇచ్చి ఆయనను రిజర్వ్‌లో పెట్టుకుంటారు.

ఇక పవన్ ఇప్పటి వరకు తన జనసేన పార్టీకి సొంతంగా సంపాదించిన డబ్బునే ఖర్చు పెట్టారు. ఎవరి దగ్గరా ఎలాంటి ఫండ్స్ కూడా తీసుకోవడం లేదు. అందుకనే ఆయన సినిమాల్లోకి మళ్లీ వచ్చారు. తన దగ్గర డబ్బు లేదని.. ప్రేక్షకులు సినిమాలు చూస్తే వచ్చే డబ్బునే తాను రాజకీయాల్లో వాడుతున్నానని.. కనుక సినిమాలు చూడాలని ఆయన గతంలోనే కోరారు.
కాగా పవన్ ఈమధ్యే తన రాజకీయ అవసరాల కోసం రూ.1 కోటికి పైగా పెట్టి 8 వాహనాలను కొనుగోలు చేశారు. త్వరలో ప్రారంభం కానున్న ఆయన పాదయాత్రలో వాటిని ఉపయోగించనున్నారు. ఇక పవన్‌కు హైదరాబాద్‌లో ఖరీదైన సొంత ఇల్లు ఉంది. పార్టీ, ఇతర అవసరాలకు అప్పుడప్పుడు కొన్ని చోట్ల ఇళ్లను ఆయన రెంట్‌కు తీసుకుంటూ ఉంటారు. అలాగే ఆయనకు ఒక ఖరీదైన ఫామ్ హౌస్ ఉంది. ఇక రాజకీయాల పరంగానే కాకుండా సినిమా ఇండస్ట్రీకి చెందిన వారికి కూడా పవన్ ఎంతో సహాయం చేస్తుంటారు. అందుకనే పవన్ అంటే ఇండస్ట్రీలో చాలా మందికి అభిమానం ఉంటుంది.