Meena : సీనియర్ నటి మీనాను ఈమధ్య దురదృష్టం వెంటాడుతున్న విషయం విదితమే. అన్నీ బాగున్నాయి.. అంతా సవ్యంగానే సాగుతోంది.. అనుకుంటున్న సమయంలో భర్త విద్యాసాగర్ మరణం ఆమెను ఎంతగానో కృంగదీసింది. దీంతో ఆమె చాలా రోజుల పాటు ఇంట్లోనే ఉంది. భర్త మరణించడంతో ఆమెపై అనేక వార్తలు వచ్చాయి. ఆమె వల్లనే ఆయన చనిపోయారని, ఆస్తి తగాదాలు ఉన్నాయని.. ఇలా రకరకాల వార్తలను ప్రచారం చేశారు. దీంతో స్పందించిన మీనా తనకు ప్రైవసీ కల్పించాలని.. దయచేసి తప్పుడు వార్తలను ప్రచురించవద్దని కోరింది. తరువాత తమ పెళ్లి రోజు సందర్భంగా భర్తను తలచుకుంటూ ఆమె ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. అయితే ఇప్పుడు మీనా డిప్రెషన్ నుంచి కాస్త బయట పడింది. ఇప్పుడే బయటకు వచ్చింది. ఓ మూవీ షూటింగ్‌లోనూ ఆమె పాల్గొంది.
మీనా తెలుగులో చివరిసారిగా మోహన్‌బాబుతో కలసి సన్నాఫ్ ఇండియా మూవీలో యాక్ట్ చేసింది. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఈమె తెలుగుతోపాటు తమిళంలోనూ పలు చిత్రాల్లో నటిస్తోంది. ఇక ఎస్‌వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు అనే మూవీలోనూ మీనా నటిస్తోంది. చాలా రోజుల తరువాత ఆమె ఈ మూవీ షూటింగ్‌కు హాజరైంది. ఈ క్రమంలోనే చిత్ర యూనిట్‌తో కలిసి ఈమె సందడి చేసింది. ఇక ఇందులో రాజేంద్ర ప్రసాద్ కూడా నటిస్తున్నారు.

ఈ మధ్యే ఆయన పుట్టిన రోజును జరుపుకోగా.. షూటింగ్ స్పాట్‌కు ఈమె కూడా హాజరైంది. అనంతరం ఆలీ భార్య జుబేదా మీనాతో మాట్లాడింది. తాను మీనాను కలిశానని జుబేదా ఓ వీడియోను పోస్ట్ చేసింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే భర్త మరణంతో మీనా సినిమాలు మానేస్తుందని.. కానీ ఒప్పుకున్న సినిమాలను అయితే పూర్తి చేస్తుందని వార్తలు వచ్చాయి. మరి దీనిపై ఆమె ఇంకా నిర్ణయం తీసుకుందా.. లేదా.. అన్న విషయాలపై త్వరలోనే క్లారిటీ రానుంది.