Murali Mohan : టాలీవుడ్లో క్యూట్ కపుల్‌గా పేరుగాంచిన సమంత, నాగచైతన్య విడిపోయి సుమారుగా 9 నెలలు అవుతోంది. ఈ క్రమంలోనే వీరికి సంబంధించి వార్తలు తరచూ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూనే ఉంటాయి. అసలు వీరు ఎందుకు విడాకులు తీసుకున్నారు.. అనే విషయం మాత్రం ఇప్పటి వరకు తెలియదు. ఈ క్రమంలోనే ఇప్పటికే వీరి విడాకుల విషయమై అనేక వార్తలు పుకార్లుగా మారి షికార్లు చేశాయి. అయితే తాము ఎందుకు విడిపోయామనే విషయాన్ని ఈ ఇద్దరిలో ఎవరు కూడా ఇప్పటి వరకు బహిరంగంగా చెప్పలేదు. కానీ వీరిపై ప్రస్తుతం సీనియర్ నటుడు మురళీ మోహన్ చేసిన కామెంట్స్ సంచలనం కలిగిస్తున్నాయి.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మురళీ మోహన్.. సమంత, నాగచైతన్యలకు సంబంధించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. తాను హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో మూడు అపార్ట్మెంట్లను కట్టానని తెలిపారు. తాను, తన కుమారుడు, కుటుంబ సభ్యులు ఉండేందుకు వాటిని కట్టుకున్నట్లు తెలిపారు. అయితే వాటిని చూసి నాగచైతన్య ముచ్చటపడ్డాడని.. ఒక అపార్ట్‌మెంట్‌ను తనకు అమ్మాలని కోరాడని తెలిపారు.

అయితే తాను, తన ఫ్యామిలీ ఉండేందుకు ఆ అపార్ట్మెంట్లను కట్టానని.. వాటిని అమ్మబోనని చైతన్యకు చెప్పానని.. కానీ చైతన్య తన తండ్రి నాగార్జునకు ఈ విషయం చెప్పగా.. నాగార్జున వచ్చి తనను కలసి అపార్ట్మెంట్ అమ్మాలని కోరారని.. తెలిపారు. దీంతో నాగార్జునపై ఉన్న గౌరవంతో ఒక అపార్ట్‌మెంట్‌ను చైతన్యకు అమ్మానని వివరించారు.
తాను అమ్మిన అపార్ట్మెంట్లోనే చైతన్య, సమంత ఉండేవారని.. మురళీ మోహన్ తెలియజేశారు. అయితే వారు ఎంతో అన్యోన్యంగా ఉండేవారని.. పార్టీలు కూడా చేసుకునేవారని.. ఒక రోజు పని మనిషి వచ్చి సమంత, నాగచైతన్య విడాకులు తీసుకుంటున్నారని చెప్పిందని.. దాంతో ఆ మాటలు విని షాకయ్యానని అన్నారు. అయితే అప్పటికే చైతన్య హోటల్లో ఉంటున్నట్లు తెలిసిందని.. దీంతో వారి విడాకులు ఫిక్స్ అయ్యాయని తెలుసుకున్నానని.. తరువాత వారు విడిపోయారని.. వివరించారు.
అయితే తన కళ్ల ముందు మాత్రం వారు ఎంతో అన్యోన్యంగా ఉండేవారని.. ఎప్పుడూ గొడవ పడేవారు కూడా కాదని.. అలాంటి జంట ఎందుకు విడిపోయిందో ఇప్పటికీ తనకు తెలియదని.. మురళీ మోహన్ అన్నారు. కాగా మురళీ మోహన్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.