Sarkaru Vaari Paata : సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్‌లు ప్రధాన పాత్రల్లో వచ్చిన మూవీ.. సర్కారు వారి పాట. ఈ సినిమా మే 12న రిలీజ్ అయింది. అయితే తొలి మూడు రోజుల పాటు ఈ మూవీకి నెగెటివ్ టాక్ ఎక్కువగా వచ్చినా.. క్రమేపీ ఈ మూవీ ఫ్యామిలీ ప్రేక్షకులకు కనెక్ట్ అయింది. దీంతో తరువాత రోజుల్లో కలెక్షన్స్ బాగానే వచ్చాయి. ఈ సినిమాకు పరశురామ్ దర్శకత్వం వహించారు. ఇక ఇందులోని పాటలు కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
అయితే అనేక మూవీల్లో చిన్న చిన్న తప్పులు జరిగినట్లుగానే సర్కారు వారి పాట మూవీలోనూ పలు తప్పులు చేశారు. ముఖ్యంగా విదేశాల్లో కీర్తి సురేష్ 10వేల డాలర్ల కన్నా ఎక్కువగానే మహేష్ బాబు వద్ద అప్పు తీసుకుంటుంది. కానీ ఆయన మాత్రం 10వేల డాలర్లు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తారు. ఇక దీంతోపాటు ఇంకో మిస్టేక్ కూడా ఈ మూవీలో కనిపిస్తోంది. అదేమిటంటే..

జైల్లో నదియా ఉన్నప్పుడు మహేష్ ఆమెను కలుస్తాడు. ఆ సమయంలో పళ్లు తెమ్మని సముద్రఖనిని పిలుస్తాడు. అయితే ఆ సమయంలో వాస్తవానికి పళ్లు ఇచ్చేందుకు వీలు కాదు. దీన్ని చూస్తే మనకు మర్యాదరామన్నలోని కొబ్బరి బొండాం ట్రెయిన్ సీన్ గుర్తుకు వస్తుంది. ఈ క్రమంలోనే ఇదే విషయాన్ని బయటకు తీసి నెటిజన్లు దర్శకున్ని ట్రోల్ చేస్తున్నారు. అయితే వాస్తవానికి ఆ సీన్‌లో ఉన్న భావోద్వేగాలను చూపించేందుకు దర్శకుడు అలా చేశాడు. కానీ అక్కడ పళ్లను ఇవ్వాలన్నది ముఖ్య ఉద్దేశం కాదు. అందువల్ల దీన్ని ప్రేక్షకులు కూడా అంతగా పట్టించుకోలేదు. అయినప్పటికీ ఈ మూవీ ఘన విజయం సాధించి వసూళ్ల వర్షం కురిపించింది.