Actress Meena : ప్రముఖ నటి మీనా ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకున్న విషయం విదితమే. ఆమె భర్త విద్యాసాగర్ (48) మంగళవారం రాత్రి అకస్మాత్తుగా చనిపోయారు. ఈ క్రమంలో ఆమె కుటుంబంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. ఆయన శ్వాసకోశ సమస్యలతో మృతి చెందారని వైద్యులు తెలిపారు. అయితే విద్యాసాగర్ మరణానికి సంబంధించి తమిళనాడులోని స్థానిక పత్రికలు రకరకాల కథనాలను ప్రచురిస్తున్నాయి. మీనా ఇంటి వద్ద పావురాలు ఎక్కువగా ఉంటాయట. ఈ క్రమంలోనే వాటి వ్యర్థాల నుంచి వచ్చే గాలిని ఆయన ఎక్కువగా పీల్చారట. అందుకనే ఆయన ఇన్ఫెక్షన్ బారిన పడి చనిపోయారట. అలా అని చెప్పి అక్కడి పత్రికలకు చెందిన వెబ్‌సైట్లలో కథనాలు వస్తున్నాయి. అయితే ఇందులో నిజం ఎంత ఉంది.. అన్న విషయం తెలియాల్సి ఉంది.
ఇక పావురాల వ్యర్థాల నుంచి వచ్చే గాలిని పీల్చడం వల్ల మీనా భర్త విద్యాసాగర్ ఊపిరితిత్తులు ఇన్పెక్షన్‌కు గురయ్యాయని తెలిసింది. ఈ క్రమంలోనే ఆయన ఈ ఏడాది ఆరంభంలో కరోనా బారిన పడ్డారు. అయితే కరోనా నుంచి కోలుకున్నప్పటికీ ఊపిరితిత్తులు బాగా దెబ్బ తిన్నాయి. దీంతో ఆయనకు లంగ్స్ ట్రాన్స్‌ప్లాంట్ చేయాల్సి వచ్చింది. ఊపిరితిత్తులు మార్చడం ఒక్కటే మార్గమని వైద్యులు చెప్పారు. కానీ లంగ్స్ ఆయనకు లభించలేదు. దాతలు ఎవరూ లేరు. దీంతో ఆయన తీవ్ర అస్వస్థతకు గురై చనిపోయారు. కాగా విద్యాసాగర్ మరణవార్త అందరినీ షాక్‌కు గురి చేస్తోంది.

కాగా మీనాకు విద్యాసాగర్‌కు 2009లో వివాహం అయింది. వీరికి నైనికా అనే కుమార్తె ఉంది. ఈమె బాలనటిగా ఇప్పటికే అదరగొట్టింది. విజయ్ పోలీసోడు సినిమాతోపాటు అరవింద్ స్వామి నటించిన భాస్కర్ ఒరు రాస్కెల్‌లోనూ నటించి మంచి మార్కులు కొట్టేసింది. అయితే విద్యాసాగర్ మరణించిన తీరుకు సినీ ఇండస్ట్రీ కూడా దిగ్భ్రాంతికి లోనవుతోంది.