Samrat Prithviraj : బాలీవుడ్ స్టార్ నటుడు అక్షయ్ కుమార్‌కు ఈ మధ్య కాలంలో గడ్డు పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. ఆయన తీస్తున్న చిత్రాలన్నీ వరుసగా ఫ్లాప్ అవుతున్నాయి. ఆయన ఈ మధ్య కాలంలో నటించిన అత్రంగీ రే, బచ్చన్ పాండే ఫ్లాప్ అయ్యాయి. ఇక ఇటీవల రిలీజ్ అయిన సామ్రాట్ పృథ్వీరాజ్ అయితే డిజాస్టర్‌గా నిలిచింది. రూ.300 కోట్లు పెట్టి సినిమా తీస్తే.. మూడో రోజే ప్రేక్షకులు లేక థియేటర్లలో షోలను క్యాన్సిల్ చేశారు. పరిస్థితి ఇలా ఉందంటే.. బాలీవుడ్‌కు ఎంత బ్యాడ్ టైమ్ నడుస్తుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.
సామ్రాట్ పృథ్వీరాజ్ మూవీని తీసేందుకు మేకర్స్ యష్ రాజ్ ఫిలిమ్స్‌కు రూ.300 కోట్లు ఖర్చు కాగా ఇప్పటి వరకు రూ.150 కోట్లు మాత్రమే వచ్చాయి. అంటే రూ.150 కోట్ల మేర నష్టం వచ్చిందని అర్థం చేసుకోవచ్చు. అక్షయ్ కుమార్ సినిమా కెరీర్‌లోనే ఇంత చెత్తగా ఫ్లాప్ అయిన సినిమాగా ఈ మూవీ రికార్డు సృష్టించింది. ఈ క్రమంలోనే ఈ మూవీకి తొలి వారంలో రూ.55 కోట్లే వచ్చాయి. ఇప్పటి వరకు ఈ మూవీ రూ.70 కోట్ల బిజినెస్ అయింది. అంటే ఇంకా ఎంత రావాలో సులభంగా అర్థం అవుతుంది. అయితే నష్టాలను ఇంకా తగ్గించుకునేందుకు గాను ఈ మూవీని ఓటీటీలో త్వరలో విడుదల చేయనున్నారు.

సామ్రాట్ పృథ్వీరాజ్ మూవీకి గాను డిజిటల్ హక్కులను ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. మొదట్లో ఈ మూవీని 4 వారాల తరువాతే రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం పాలైంది. దీంతో మరో వారంలోనే ఈ మూవీని ఓటీటీలో రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ఇక దీనిపై అధికారిక ప్రకటనను అమెజాన్ త్వరలోనే వెల్లడించనుంది. ఏది ఏమైనా.. అగ్ర హీరోల సినిమాలకు ఇలా వరుసగా ఎదురు దెబ్బలు తగులుతుండడం చర్చనీయాంశంగా మారింది.