Nayanthara : లేడీ సూపర్ స్టార్‌గా పేరుగాంచిన నయనతార.. దర్శకుడు విగ్నేష్ శివన్‌ను వివాహం చేసుకున్న విషయం విదితమే. ఈ క్రమంలోనే నూతన దంపతులకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. గురువారం మహాబలిపురంలో ఈ వీరు బంధువులు, సెలబ్రిటీల సమక్షంలో ఒక్కటయ్యారు. ఈ సందర్భంగా తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా వీరు ఒక లక్ష మంది పేదలకు అన్నదానం చేసి గొప్ప మనసు చాటుకున్నారు. అయితే నయన్, విగ్నేష్ దంపతులు ప్రస్తుతం వివాదంలో చిక్కుకుపోయారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
నూతన దంపతులు నయనతార, విగ్నేష్ శివన్‌లు తిరుమలలో శుక్రవారం శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మాడ వీధుల్లో తిరిగారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. ఫొటోలకు పోజులు కూడా ఇచ్చారు. అయితే అంతా బాగానే ఉంది కానీ.. వీరు చెప్పులు ధరించి మాడ వీధుల్లో తిరిగారు. దీంతో ఈ విషయం వివాదాస్పదం అవుతోంది. అందరూ చూస్తున్నా కూడా.. చెబుతున్నా కూడా.. వారు చెప్పులు ధరించి తిరిగారని.. నెటిజన్లు మండిపడుతున్నారు. అయితే దీనిపై వారు స్పందించాల్సి ఉంది.
కాగా నయనతార, విగ్నేష్ శివన్‌లు 7 ఏళ్లుగా ప్రేమించుకున్నారు. ఈ క్రమంలోనే వారు ప్రేమకు ఫుల్స్టాప్ పెట్టి పెళ్లిబంధం ద్వారా ఒక్కటయ్యారు. 2015లో నేనూ రౌడీనే అనే సినిమాకు విగ్నేష్ శివన్ దర్శకత్వం వహించగా.. ఇందులో నయనతార, విజయ్ సేతుపలి కీలకపాత్రల్లో నటించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే నయన్, విగ్నేష్‌లు ప్రేమలో పడ్డారు. అయితే అంతకు ముందు నయనతార ప్రభుదేవాతో ప్రేమలో పడి ఆయనకు బ్రేకప్ చెప్పింది. తరువాత మళ్లీ సినిమాల్లో యథావిధిగా నటించడం మొదలు పెట్టింది. అయితే ఇప్పుడు వివాహం అయింది కనుక ఆమె మళ్లీ సినిమాల్లో నటిస్తుందా.. లేదా.. అన్న విషయం తెలియాల్సి ఉంది.