Sri Reddy : నటి శ్రీరెడ్డి ఈ మధ్య సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటోంది. ముఖ్యంగా తన యూట్యూబ్ చానల్లో ఆమె రకరకాల వంటల వీడియోలను పోస్ట్ చేస్తోంది. దీంతో ఆ వీడియోలు సహజంగానే వైరల్ అవుతున్నాయి. ఇక తాజాగా శ్రీరెడ్డి పీతల కూర చేసింది. దాని తాలూకు వీడియోను తన యూట్యూబ్ చానల్ లో పోస్ట్ చేసింది. అది కూడా వైరల్ అవుతోంది. అయితే శ్రీరెడ్డి గతంలోనూ ఓసారి పీతల కూర చేసింది. కానీ అప్పుడు పీతలు చాలా చిన్నగా ఉన్నాయి. కానీ ఇప్పుడు కాస్త పెద్ద సైజులో ఉన్న పీతలతో ఆమె కూర చేసింది. దీంతో ఆ పీతలు చాలా పెద్దగా ఉన్నాయని ఆమె కామెంట్స్ చేసింది.
శ్రీరెడ్డి అంటేనే సహజంగానే వివాదాలకు మారుపేరుగా నిలుస్తుంటుంది. ఈమె ఏం చేసినా అది వివాదాస్పదం అవుతూనే ఉంటుంది. ఈమెకు సోషల్ మీడియాలో ఎంత మంది ఫాలోవర్లు ఉన్నారో.. అంతగా విమర్శించే వారు కూడా ఉన్నారు. అందుకనే ఈమె ఫైర్ బ్రాండ్ అన్న ముద్రను కూడా వేసుకుంది. ఈ క్రమంలోనే ఈమె సమాజంలో జరిగే సంఘటనలపై కూడా స్పందిస్తుంటుంది.

శ్రీరెడ్డి ఎల్లప్పుడూ ఏదో ఒక విషయంలో వార్తల్లో నిలుస్తుంటుంది. మొన్నా మధ్య నాగబాబు కుమార్తె నిహారిక డ్రగ్స్ కేసు విషయంలో ఆయనపై తీవ్ర విమర్శలు చేసింది. తరువాత మళ్లీ స్పందించలేదు. ఇక ఇటీవలే ఏపీ ప్రభుత్వంలో మంత్రుల మార్పు జరగ్గా.. ఓ మహిళా మంత్రి తనకు నచ్చలేదని.. ఓవర్ యాక్షన్ తగ్గించుకుంటే మంచిదని చెప్పింది. అలాగే కరాటే కల్యాణి, యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డికి మధ్య జరిగిన గొడవలో ఈమె కల్యాణిని తిడుతూ శ్రీకాంత్ రెడ్డికి సపోర్ట్ ఇచ్చింది. ఇలా ఈమె ప్రతి వివాదాస్పద విషయంలోనూ ఎంటర్ అవుతూ మరింత వివాదాన్ని క్రియేట్ చేస్తోంది. అలాగే మరోవైపు యూట్యూబ్లో వంటల వీడియోల ద్వారా కూడా అలరిస్తోంది.