Sree Leela : యంగ్ హీరోయిన్ శ్రీలీల ప్రస్తుతం వరుస సినిమాలతో జోరు మీద ఉందని చెప్పవచ్చు. ఈమె నటించిన పెళ్లి సందD మూవీ బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచినప్పటికీ ఈమె గ్లామర్‌కు అవకాశాలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పటికే ఈమె పలు చిత్రాల్లో నటిస్తోంది. మాస్ మహరాజ రవితేజ పక్కన ఈ బ్యూటీ ధమాకా అనే మూవీలో నటిస్తోంది. అయితే శ్రీలల తాజాగా ఓ బంపర్ ఆఫర్‌ను కొట్టేసిందని తెలుస్తోంది.
శ్రీలల.. ఏకంగా నందమూరి బాలకృష్ణ సినిమాలో నటించే అవకాశాన్ని సంపాదించిందని సమాచారం. ఈ క్రమంలోనే ఆ మూవీకి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించనున్నారు. బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. దీనికి అన్నగారు అనే టైటిల్ పరిశీలనలో ఉన్న విషయం విదితమే. అయితే ఈ సినిమా అనంతరం అనిల్ రావిపూడితో బాలయ్య సినిమా చేస్తారు. ఇందులోనే శ్రీలీలను తీసుకుంటున్నారని సమాచారం. ఈమె అందుకు ఓకే చెప్పినట్లుగా కూడా తెలుస్తోంది.

అయితే శ్రీలీల బాలకృష్ణ పక్కన హీరోయిన్ గా కాదు.. ఆయనకు ఆ సినిమాలో కూతురుగా నటిస్తుందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే బాలకృష్ణ ఆ మూవీలో 50 ఏళ్ల వయస్సు పాత్రలో నటిస్తారని తెలుస్తోంది. ఆ క్యారెక్టర్‌కు భార్య ఓ సీనియర్ హీరోయిన్‌ను ఎంపిక చేయనున్నారట. ఇక వీరికి కుమార్తె పాత్రలో శ్రీలీల నటిస్తుందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ మూవీలో తండ్రి, కూతురు సెంటిమెంట్‌ను హైలైట్ చేసి చూపిస్తారట. ఇక దీనిపై త్వరలోనే మరిన్ని వివరాలు తెలియనున్నాయి.