Mahesh Fans : సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్‌లు ప్రధాన పాత్రల్లో వచ్చిన లేటెస్ట్ చిత్రం.. సర్కారు వారి పాట. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. సమాజానికి మెసేజ్ ఇచ్చే సినిమా కావడంతో సహజంగానే అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి ఈ సినిమాకు ఆదరణ లభిస్తోంది. అయితే కొందరు ఈ సినిమాపై నెగెటివ్ టాక్‌ను వ్యాప్తి చేస్తున్నారు. దీంతో మహేష్ ఫ్యాన్స్ వారిని వెతికి పట్టుకుని మరీ ట్రోల్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ ప్రముఖ న్యూస్ చానల్ ఈ మూవీ గురించి నెగెటివ్ టాక్ చేయగా.. మహేష్ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సినిమా బాగుంటే నెగెటివ్ టాక్‌ను ఎలా వ్యాప్తి చేస్తారంటూ.. వారు ఆ చానల్ యాజమాన్యంపై మండిపడుతున్నారు.
ఇక ఆ చానల్‌ను మహేష్ ఫ్యాన్స్ బండ బూతులు తిడుతున్నారు. అంతేకాదు.. ఆ చానల్ పేరుకు ఒక బండ బూతును చేర్చి దాన్ని హ్యాష్‌ట్యాగ్‌గా మార్చి ట్విట్టర్‌లో ట్రెండ్ చేస్తున్నారు. దీంతో దెబ్బకు దిగి వచ్చిన సదరు చానల్ యాజమాన్యం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. సర్కారు వారి పాట బాగుందంటూ వార్తలను ప్రసారం చేసింది. అయినప్పటికీ మహేష్ ఫ్యాన్స్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. తప్పనిసరిగా క్షమాపణలు చెప్పాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్‌గా మారింది.

కాగా సర్కారు వారి పాట మూవీకి గాను తొలి 3 రోజుల్లో రూ.112 కోట్ల గ్రాస్ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తొలి వారం రోజులు ఈ మూవీకి ఎన్ని కలెక్షన్లు వస్తాయోనని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక సర్కారు వారి పాట అనంతరం కాస్త బ్రేక్ తీసుకున్న తరువాత మహేష్ త్రివిక్రమ్‌తో కలిసి సినిమా చేస్తారు. తరువాత రాజమౌళి సినిమా ఉంటుంది. ఇది 2023లో ప్రారంభం అవుతుంది.