Bheemla Nayak : సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్‌లు నటించిన లేటెస్ట్ మూవీ.. సర్కారు వారి పాట. ఈ సినిమాకు అన్ని వర్గాల నుంచి ఆదరణ లభిస్తోంది. తొలి రెండు రోజులు సినిమాకు కాస్త నెగెటివ్ టాక్ వచ్చింది. కానీ రాను రాను మూవీకి మంచి స్పందన లభిస్తోంది. ముఖ్యంగా సమాజానికి మెసేజ్ ఇచ్చే విధంగా సినిమాను తెరకెక్కించారు. అందులోనూ బ్యాంకింగ్ రంగం గురించి ముఖ్యమైన విషయాలను వెల్లడించారు. అందువల్ల ఈ మూవీ సామాన్య ప్రజలను విపరీతంగా ఆకట్టుకుంటోంది. వారి జీవితాలకు చెందిన కీలక విషయాలను ఈ సినిమాలో చూపించారు. దీంతో ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది.
ఇక సర్కారు వారి పాటకు పరశురామ్ దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించారు. ఈ మూవీలో కొన్ని కామెడీ సీన్స్ కూడా అద్భుతంగా వచ్చాయి. ముఖ్యంగా వెన్నెల కిషోర్, ప్రభాస్ శ్రీను, సుబ్బరాజుల కామెడీ సీన్లు ఆకట్టుకుంటున్నాయి. అయితే మహేష్ బాబు, సుబ్బరాజులతో వచ్చే కామెడీ సీన్లలో సుబ్బరాజుకు భీమ్లా నాయక్ రింగ్ టోన్ వినిపిస్తుంది. ఆయనకు మహేష్ ఫోన్ చేసినప్పుడల్లా భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ రింగ్ టోన్‌లా వినిపిస్తుంది. అయితే మహేష్ లాంటి అగ్ర హీరో సినిమాలో ఇంకో అగ్ర హీరో రిఫరెన్స్‌ను వాడడం అసలు దాదాపుగా జరగదు. చిన్న హీరోలే ఇలా చేస్తారు. కానీ సర్కారు వారి పాటలో భీమ్లా నాయక్ రింగ్ టోన్‌ను అలా వాడారు. దీంతో ఈ విషయం చర్చనీయాంశంగా మారడమే కాకుండా.. అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

భీమ్లా నాయక్‌కు వాస్తవానికి థమన్ సంగీతం అందించారు. సర్కారు వారి పాటకు కూడా ఆయన మ్యూజిక్ డైరెక్టర్. ఇక సర్కారు వారి పాట తీసిన మైత్రి మూవీ మేకర్స్ ప్రస్తుతం పవన్‌తో భవదీయుడు భగత్ సింగ్ అనే సినిమాను నిర్మిస్తోంది. దీంతో ఆ మూవీకి పబ్లిసిటీ అయినట్లు ఉంటుందని చెప్పి సర్కారు వారి పాట సినిమాలో భీమ్లా నాయక్ రింగ్ టోన్‌ను వాడి ఉంటారని తెలుస్తోంది. అయితే దీని వెనుక ఉన్న కారణాలు తెలియదు కానీ.. మహేష్ లాంటి అగ్రహీరో సినిమాలో ఇంకో అగ్ర హీరో రిఫరెన్స్‌ను వాడడంపై చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.