Balakrishna : బోయపాటి శ్రీను, బాలకృష్ణల కాంబినేషన్‌లో వచ్చిన అఖండ మూవీ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ మూవీ కరోనా సమయంలో రిలీజ్ అయి ఇండస్ట్రీకి ఊపిరి పోసింది. తరువాత మేకర్స్ సినిమాలను రిలీజ్ చేసేందుకు కావల్సినంత ధైర్యాన్ని ఈ మూవీ ఇచ్చిందనే చెప్పవచ్చు. అయితే అఖండ సక్సెస్ తరువాత అఖండ 2 వస్తుందని.. బోయపాటి కథను సిద్ధం చేస్తున్నారని వార్తలు వచ్చాయి. కానీ దీనిపై క్లారిటీ లేదు. అయితే తాజాగా ఓ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది.

అఖండ మూవీ తరువాత బాలకృష్ణ దర్శకుడు గోపీచంద్ మలినేనితో కలిసి ఓ మాస్ యాక్షన్ మూవీని చేస్తున్న విషయం విదితమే. ఇందులో బాలయ్యకు జోడీగా శృతిహాసన్ నటిస్తోంది. దీన్ని మైత్రీ మూవీస్ నిర్మిస్తోంది. ఎన్‌బీకే107 అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ మూవీకి గాను బాలకృష్ణ రూ.12 కోట్ల రెమ్యునరేషన్ ప్లస్ జీఎస్‌టీ తీసుకుంటున్నారట. ఆయన అఖండ సినిమాకు రూ.11 కోట్లు ప్లస్ జీఎస్టీని తీసుకున్నారు. అయితే అఖండ హిట్ అయినప్పటికీ బాలకృష్ణ తన రెమ్యునరేషన్‌ను మరీ భారీగా పెంచలేదు. ఒక కోటి రూపాయలు పెంచారు. దీంతో మైత్రీ మూవీస్ సంబరపడుతుందట.
ఇక ఎన్‌బీకే 107 సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. దీనికి అన్నగారు అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఇందులోనూ బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు సమాచారం. ఆయన డ్యుయల్ రోల్ లో ఇటీవలి కాలంలో నటించిన అనేక సినిమాలు హిట్ అయ్యాయి. కనుక ఒక పాత్రలో తండ్రిగా.. ఇంకో పాత్రలో కొడుకుగా బాలయ్య కనిపించనున్నారట. ఇక ఈ మూవీ గురించి మరింత సమాచారం త్వరలోనే తెలియనుంది.