The Kashmir Files : ఇటీవలి కాలంలో దేశ వ్యాప్తంగా సంచనలం సృష్టించిన చిత్రం ది కాశ్మీర్ ఫైల్స్. వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ఈ సినిమా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఓ నాలుగైదు వారాల పాటు ఈ మూవీ గురించి దేశ వ్యాప్తంగా తెగ చర్చ నడిచింది. సినిమా ప్రేక్షకులే కాకుండా రాజకీయ నాయకులు కూడా ఈ మూవీపై చర్చలు జరిపారు. మూడు దశాబ్దాల క్రితం కాశ్మీర్ లోని హిందూ పండిట్ల మీద జరిగిన దాడి, దాంతో వారు కాశ్మీర్ లోయను వదిలి దేశంలోని వివిధ ప్రాంతాలకు వలస వెళ్ళిపోయిన సంఘటనలు, వాటిని మసిపూసి మారేడు కాయ చేసే ప్రయత్నం చేస్తున్న వామపక్షీయుల చర్యలను ఈ చిత్రంలో వివేక్ అగ్నిహోత్రి కళ్ళకు కట్టినట్టు చూపించారు.

ఇక ఈ సినిమాలో నటించిన నటీనటులు తమ పర్ఫార్మెన్సులతో ఈ సినిమాకు ప్రాణం పోశారు. ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే కలెక్షన్లు రాబడుతూ ప్రేక్షకుల మన్ననలు అందుకుంది. ఇప్పుడీ సినిమాను మే 13న స్ట్రీమింగ్ చేయబోతున్నట్టు జీ5 సంస్థ తెలిపింది. ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం చాలా పెద్ద హిట్ అయింది. అతి తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాను సెలబ్రిటీల దగ్గర్నుండి సామాన్య ప్రేక్షకుల వరకు అందరూ ఆదరించారు.
ఇక ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు చాలా ఆసక్తి చూపించడంతో ఈ సినిమా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ అయ్యేందుకు రెడీ అయ్యింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం జీ5 ఈ చిత్ర ఓటీటీ రైట్స్‌ను భారీ మొత్తానికి కొనుగోలు చేసింది. ఓటీటీలో సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ సినిమా మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ఓటీటీ రిలీజ్ తర్వాత ఎలాంటి పరిస్థితులు తలెత్తుతాయి.. అనే చర్చ నడుస్తోంది.