Today Gold Rates : గత కొద్ది రోజుల కిందట బంగారం ధరలు తగ్గుతూ వచ్చాయి. కానీ మళ్లీ పసిడి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. వారం రోజుల నుంచి ధరలు కాస్త పెరగడం లేదా స్థిరంగా ఉండడం.. వంటివి జరిగాయి. కానీ దేశంలోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. ఈ క్రమంలోనే ఎక్కడ చూసినా పెరిగిన రేట్లకే బంగారాన్ని విక్రయిస్తున్నారు. ఇక ఇవాళ అమలు చేస్తున్న బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల బంగారం ధర ఢిల్లీలో రూ.49,850 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.54,380గా ఉంది. అలాగే ముంబైలో ఈ ధర వరుసగా రూ.49,850, రూ.54,380గా ఉన్నాయి.

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.49, 850 గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.54, 380 గా ఉంది. విజయవాడలో రూ.49, 850, రూ.54, 380 గా బంగారం ధరలు ఉన్నాయి. ఇలా బంగారం ధరలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయని చెప్పవచ్చు. దీంతోపాటు వెండి ధరలు కూడా అలాగే పెరుగుతున్నాయి.
ఇవాళ వెండి ధర కిలోకు రూ.75, 200 గా ఉంది. అయితే మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. నిమిష నిమిషానికి మారుతుంటాయి. కనుక బంగారం, వెండి కొనుగోలు చేసే వారు ఆ సమయంలో ఉండే ధరలను మరోసారి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే దేశంలో మళ్లీ కరోనా వేవ్ వస్తుందని అంటుండడంతో బంగారం ధరలు ఇంకా పెరుగుతాయనే అంటున్నారు. ఈ విషయాలు రానున్న రోజుల్లో తెలుస్తాయి.