Chiranjeevi : ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోయిన్స్‌లో సమంత ఒకరు. ఈ అమ్మడు గత కొద్ది కాలంగా హాట్ టాపిక్‌గా మారుతోంది. సమంత ఇటీవల లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తోంది. జయాపజయాలు అనేది లేకుండా సినిమాలు చేస్తోంది సమంత. సమంత నటించిన శాకుంతలం చిత్రంతోపాటు ఓ తమిళ చిత్రం కూడా విడుదలకి సిద్ధంగా ఉన్నాయి. పాన్ ఇండియా చిత్రం యశోద రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఆగస్టు 12న ఇది విడుదల కానుంది. దీంతో మాజీ వదిన, మరిది మధ్య పోటీ అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇక్కడ ఊహించని ట్విస్ట్ మరొకటి జరగబోతోంది. ఏప్రిల్ 29న మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య చిత్రం రిలీజ్ కు రెడీ అవుతోంది. కొన్ని నెలల గ్యాప్ లోనే చిరు మరో చిత్రంతో రాబోతున్నారు.

ఆగస్ట్ 12న చిరంజీవి గాడ్ ఫాదర్ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. అదే రోజున అఖిల్ ఏజెంట్ చిత్రం కూడా రిలీజ్ కానుంది. మలయాళీ బ్లాక్ బస్టర్ లూసిఫెర్ రీమేక్ లో చిరు నటిస్తున్న సంగతి తెలిసిందే. మోహన్ రాజా దర్శకత్వంలో గాడ్ ఫాదర్ గా తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని ఆగష్టు 11న రిలీజ్ చేసేందుకు సన్నాహకాలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే కనుక జరిగితే సమంత యశోద చిత్రానికి చిక్కులు తప్పవు. గాడ్ ఫాదర్ రిలీజ్ డేట్ అధికారికంగా ప్రకటించిన తర్వాత యశోద చిత్ర యూనిట్ ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మెగాస్టార్ చిరంజీవి నుంచి తక్కువ గ్యాప్ లో రెండు చిత్రాలు రిలీజ్ కానుండడం ఊహించని పరిణామమే.
ఇదిలా ఉండగా అమీర్ ఖాన్‌తో నాగ చైతన్య కలిసి చేసిన లాల్ సింగ్ చద్దా సినిమా కూడా అదే సమయంలో విడుదల కానుంది. ఈ సమయంలో ఈ సినిమాని పోస్ట్ పోన్ చేయలేరు. ఇక వెనక్కి వెళితే అఖిల్ హీరోగా చేసిన ఏజెంట్ మూవీ లేదా సమంత టైటిల్ పాత్రలో నటిస్తోన్నయశోద సినిమాలే వెనక్కి వెళ్లాల్సి ఉంటుంది. ఒకవేళ ఎవరూ వెనక్కి తగ్గకపోతే.. థియేటర్స్ ఎలా సర్దుబాటు అవుతాయనేది ఆలోచించాల్సిన విషయమే. అయితే అఖిల్, సమంత.. ఇద్దరినీ పోల్చి చూస్తే.. అఖిల్ అక్కినేని హీరో కనుక.. ఆయన మూవీ విడుదలను ఆపలేరు. దీంతో ఎటు తిరిగి సమంత మూవీకే ఎసరు తగిలేలా కనిపిస్తోంది. అయితే గాడ్ ఫాదర్ రిలీజ్ డేట్ ను ప్రకటిస్తే.. అది ఆగస్టు 11 లేదా 12 అయితే అప్పుడు యశోద మేకర్స్ ఒక ప్రకటన చేసే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. ఇక అవే తేదీల్లో గాడ్ ఫాదర్ ను రిలీజ్ చేస్తామని ప్రకటిస్తే.. సమంత సినిమాకే ఎక్కువ ముప్పు ఉంటుందని తెలుస్తోంది. మరి ఈ విషయంలో ఏం జరుగుతుందో చూడాలి.