Tamannaah : మిల్క్ బ్యూటీ తమన్నా భాటియా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వరుస సినిమాలతో ఎంతో క్రేజ్ దక్కించుకున్న ఈమె ఒకవైపు వెబ్ సిరీస్ లో నటిస్తూనే మరోవైపు హిందీ వీడియో సాంగ్స్ ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తోంది. ఇలా వరుస వీడియో సాంగ్స్ రిలీజ్ చేస్తూ నార్త్ ఇండియాలో కూడా ఎంతో మంచి క్రేజ్ సంపాదించుకుంది తమన్నా. గత కొన్ని సంవత్సరాల క్రితం సింగర్ అభిజిత్ సావంత్ తో కలిసి ఆప్కా అభిజిత్ సావంత్ ఆల్బమ్స్ నుంచి లాఫ్జోన్ మెయిన్ మ్యూజిక్ వీడియో సాంగ్ ను విడుదల చేశారు.
ఈ వీడియో సాంగ్స్ నార్త్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా మరొక పాట ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ క్రమంలోనే సింగర్ బాద్షాతో కలసి రెట్రో పాండా ఆల్బమ్స్ నుంచి పార్ట్-1 గా తబహీ అనే మ్యూజిక్ వీడియో సాంగ్ ను విడుదల చేశారు. ఈ పాటకు హితేన్ ట్రెండీ మ్యూజిక్ ను అందించగా తమన్నా గ్లామర్ స్టెప్పులతో మరింత క్రేజ్ తీసుకువచ్చింది.
తాజాగా ఈ పాటను విడుదల చేయడంతో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఈ పాట ద్వారా తమన్నా నార్త్ ప్రేక్షకులను మరో సారి ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. ఈ విధంగా వీడియో సాంగ్స్ వెబ్ సిరీస్ సినిమాల ద్వారా తమన్నా ప్రస్తుతం ఎంతో బిజీగా గడుపుతోంది. ఇక తెలుగులో ఈమె మెగాస్టార్ చిరంజీవి సరసన బోళా శంకర్ సినిమాలో నటిస్తోంది.