Good Luck Sakhi : మహానటి సినిమా కీర్తి సురేష్‌కు ఎంతటి పేరును తెచ్చి పెట్టిందో అందరికీ తెలిసిందే. అయితే ఆ మూవీ తరువాత ఆమెకు ఆఫర్లు వచ్చినా.. ఆమె చేసిన సినిమాలు కంటిన్యూగా ఫ్లాపవుతున్నాయి. ఇక ఈ మధ్యే విడుదలైన గుడ్ లక్ సఖి అనే మూవీ కూడా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ఈ మూవీ అట్టర్ ఫ్లాప్ అయింది. అసలు ఈ సినిమా వచ్చినట్లే చాలా మందికి తెలియదు. ఇక ఈ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ కానుంది.

కీర్తి సురేష్ నటించిన గుడ్ లక్ సఖి మూవీ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ కానుంది. దీన్ని ఈ నెల 12వ తేదీ నుంచి స్ట్రీమ్ చేయనున్నారు. ఈ మేరకు మేకర్స్ ఒక ప్రకటనలో తెలిపారు. జనవరి 28వ తేదీన థియేటర్లలో విడుదలైన ఈ మూవీ కేవలం 15 రోజుల్లోనే ఓటీటీలోకి రావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
ఇక కీర్తి సురేష్ ప్రస్తుతం మహేష్ బాబుతో కలిసి సర్కారు వారి పాట సినిమాలో నటిస్తోంది. అలాగే మెగాస్టార్ చిరంజీవి సినిమా భోళా శంకర్‌లోనూ ఓ పాత్ర చేస్తోంది. ఈ మూవీలో కీర్తి సురేష్ మెగాస్టార్ చెల్లెలి పాత్రను పోషిస్తోంది. మరి ఈ రెండు మూవీలతో అయినా ఈమె హిట్ కొడుతుందా.. లేదా.. అన్నది చూడాలి.