Mouni Roy : హిందీ, తెలుగు వంటి భాషల్లో ఒకప్పుడు బుల్లితెరపై ప్రసారం అయిన నాగిని సీరియల్ అంటే ఎంతో మందికి ఇష్టం. ఈ సీరియల్‌లో నటించిన మౌనీ రాయ్‌కు ఎంతో పేరు వచ్చింది. దీంతో ఆమెకు పలు సినిమాల్లో ఆఫర్లు కూడా వచ్చాయి. అయితే ఇటీవలే ఆమె సూరజ్ నంబియార్ అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుంది. ఈ క్రమంలోనే ఆమె ప్రస్తుతం భర్తతో కలిసి ఎంజాయ్ చేస్తోంది.

వివాహం అనంతరం భర్తతో కలిసి కాశ్మీర్‌కు వెళ్లిన మౌనీ రాయ్ అక్కడి మంచు పర్వతాల్లో విహరిస్తోంది. అలాగే మోనోకినీ ధరించి స్విమ్మింగ్ పూల్‌లో సందడి చేసింది. ఆ దుస్తుల్లో ఆమె మతులు పోగొడుతోంది. పెళ్లి చేసుకున్న తరువాత కూడా మౌనీ రాయ్ అందాల ప్రదర్శనలో ఏమాత్రం తగ్గడం లేదు.
మౌనీ రాయ్ కాశ్మీర్ లో భర్తతో కలిసి దిగిన పలు ఫొటోలను కూడా షేర్ చేసింది. మంచు పర్వతాల్లో అత్యంత గడ్డకట్టించే చలిలో ఆమె ఉన్ని దుస్తులు ధరించి భర్తతో కలిసి విహరిస్తోంది. ఈ క్రమంలోనే ఆమె షేర్ చేసిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.