Thaman : సెలబ్రిటీలు చాలా మంది కరోనా లాక్‌డౌన్ సమయాన్ని చాలా సద్వినియోగం చేసుకున్నారు. చాలా మంది అధికంగా బరువు ఉన్నవారు బరువు తగ్గారు. అయితే ఈ మధ్య కాలంలో అనేక మంది సెలబ్రిటీలు బరువు తగ్గుతూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. వారిలో మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఒకరు. ఈయన పలు వరుస సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టారు. ఫలితంగా.. ఏకంగా 35 కిలోల బరువు తగ్గారు.

మ్యూజిక్ డైరెక్టర్ థమన్ తన వెయిట్ లాస్ జర్నీపై తాజా పోస్ట్ పెట్టారు. అందులో ఆయన 137 కిలోల నుంచి 101 కిలోల వరకు బరువు తగ్గినట్లు చెప్పారు. అలా జరిగిందన్నమాట.. అని కాప్షన్ కూడా పెట్టారు. ఈ క్రమంలోనే బరువు తగ్గిన థమన్ ను చూసి ప్రేక్షకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
బరువు తగ్గిన థమన్‌ను చూసి నెటిజన్లు పలు కామెంట్లు చేశారు. సిక్స్ ప్యాక్ బాడీ ట్రై చేయాల్సింది.. అని చాలా మంది కామెంట్లు పెడుతున్నారు. ఇక థమన్ ప్రస్తుతం పలు వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. శివ కార్తికేయన్‌కు చెందిన సినిమాకు ఆయన సంగీతం అందిస్తుండగా.. ఆయన చేతిలో భీమ్లా నాయక్, ఘని, మహేష్ బాబు 28వ సినిమా, రామ్ చరణ్ 15వ సినిమా, గాడ్ ఫాదర్, బాలకృష్ణ 107వ సినిమాలు ఉన్నాయి. ఇవి ఈ ఏడాది విడుదల కానున్నాయి.